Vaishnav Tej : జీవితాంతం మా మామాలకు రుణపడి ఉంటాం.. వైష్ణవ్ తేజ్

Vaishnav Tej

Vaishnav Tej

Vaishnav Tej : ఏపీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ప్రభంజనం అంతా ఇంతా కాదు. జనసేన పోటీ చేసిన 21 స్థానాలను కైవసం చేసుకుని విజయ దుందుభి మోగించింది. పవన్ కల్యాణ్ 72 వేల పైచిలుకు ఓట్లకు పిఠాపురంలో గెలుపొందారు. దీంతో జనసేన సైనికులతో పాటు ఇతర సినీ ప్రముఖులు, మెగా కుటుంబం కూడా  సంబరాల్లో మునిగిపోయారు.

అయితే మెగా కుటుంబం మాట్లాడిన ఒక్కో పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. మా ముగ్గురు మామాలు లేనిదే మేం లేము అని, వారు మాకెంతో చేశారని దీనికి వారికి మేం లైఫ్ లాంగ్ రుణపడి ఉంటామని అన్నాడు. చిరంజీవి మామయ్య, నాగబాబు, పవన్ కల్యాణ్ మామయ్యలు మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నారో మాటల్లో చెప్పలేమన్నాడు.

చిరంజీవి నిజంగానే వారి కోసం ఎంతో చేశాడు. మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు చెల్లెళ్లు కూడా బాగుండాలని వారికి కూడా కోట్ల విలువ చేసే భూములు ఇచ్చాడు. వారి కొడుకులు బాగుండాలని జీవితంలో పైకి రావాలని కోరుకునే వాళ్లలో చిరు, పవన్, నాగబాబు ముందుంటారు. చెల్లెళ్లను చూసుకోవడంలో కూడా వారి తర్వాతే ఎవరైనా అని చెప్పొచ్చు. ఇప్పటికీ కూడా ఏ పంక్షన్ జరిగినా కూడా ఆ కుటుంబాలు లేనిదే ఏదీ జరగదు.

సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లను ఇద్దరిని హిరోలుగా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయడమే కాక.. అనేక రకాల సాయం చేసి ఆ కుటుంబాలను ఈ మెగా కుటుంబం నిలబెట్టింది. దీంతో వారికి ఎప్పటికీ రుణపడి ఉంటామని సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లు ఎన్నో సార్లు ప్రకటించారు. వైష్ణవ్ తేజ్ డైరెక్టు చిరంజీవి ఆసీనులైన ఒక సమావేశంలో ఇలా మాట్లాడటం జరిగింది. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. పవన్ గెలుపుతో కొణిదెల కుటుంబంలో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.

TAGS