Railway Minister Ashwini Vaishnav : ఏపీలో రైల్వే అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్

Railway Minister Ashwini Vaishnav
Railway Minister Ashwini Vaishnav : ఏపీలో రైల్వే అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. లోక్ సభలో ఏపీలో రైల్వే ప్రాజెక్టులపై ఎంపీలు కేశినేని చిన్ని, సీఎం రమేశ్ ప్రశ్నలు అడిగారు. ఏపీ చాలా ముఖ్యమైన రాష్ట్రమని, గతంతో పోల్చితే కేటాయింపులు పెంచామని మంత్రి వెల్లడించారు. 2023-24 సంవత్సరానికి ఏపీకి రూ.8,406 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు.
విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధికి కృషి చేసినట్లు తెలిపారు. అమరావతిలో రైల్వే స్టేషన్ ఏర్పాటుకు నిధులు కేటాయించినట్లు చెప్పారు. అమరావతి, విజయవాడ రైల్వేస్టేషన్ల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని రైల్వే మంత్రి స్పష్టం చేశారు. ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. విజయవాడ స్టేషన్ ను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అప్ గ్రేడ్ చేస్తామన్నారు. అనకాపల్లి స్టేషన్ గురించి వివరాలు నివేదిక రూపంలో ఇస్తానని చెప్పారు. ప్రస్తుతం జరుగుతన్న పనులు వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి వెల్లడించారు.