Washington DC : చంద్రబాబు కోసం మేము సైతం..వాషింగ్టన్ డీసీలో ఎన్నారై మహిళల సమరశంఖం
Washington DC : వైసీపీ అరాచకపాలనపై రాష్ట్ర ప్రజలే కాకుండా విదేశాల్లో ఉన్న తెలుగువారు సైతం ఒక్కటవుతున్నారు. జగన్ పార్టీని గద్దె దించేందుకు మేము సైతం అంటూ ఎన్ఆర్ఐ మహిళలు సమరశంఖం పూరించారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీ వర్జినియాలో ఎన్ఆర్ఐ మహిళల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సాయిసుధ పాలడుగు మాట్లాడుతూ.. స్వస్థలాలకు వెళ్లగలిగిన వారు వెళ్లి ఏదో ఒక రూపంలో సహాయపడడం, లేదా కనీసం ఇక్కడి నుంచైనా టీడీపీ విజయానికి సహకారం అందించాలన్నారు. మంజూష గోరంట్ల మాట్లాడుతూ..చంద్రబాబు నాయుడు ద్వారానే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. పరిశ్రమల స్థాపన ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అనిత మన్నవ మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని దుయ్యపడ్డారు. అన్ని వర్గాలపై దాడులు జరుగుతున్నాయని, వ్యవస్థలను భ్రష్టు పట్టించారని ఆరోపించారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మన వంతు కర్తవ్యం నిర్వహించాలని కోరారు.
సింధూ పూసల మాట్లాడుతూ..అమెరికాలో ఉంటున్న తమకే ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ఆందోళనగా ఉందన్నారు. అందుకు తాము సైతం చంద్రబాబు సీఎం కావాలని కోరుకుంటున్నామన్నారు. శాంతి పారుపల్లి మాట్లాడుతూ.. యువత భవిష్యత్ బాగుండాలంటే టీడీపీ అధికారంలోకి రావాలన్నారు. నీలిమా మండవ మాట్లాడుతూ.. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు రాష్ట్రానికి రావడంతో పాటు చుట్టుపక్కల వారిని చైతన్యపరుస్తామన్నారు. కార్యక్రమంలో సరిత పోసాని, రజని పాలడుగు, ప్రణీత కంతు, విద్య కుక్కపల్లి, కృష్ణవేణి కూరపాటి, శ్రీవిద్య సోమ, పద్మ యడ్లపల్లి, కార్జెల్ చలసాని, ప్రసన్న కొల్ల, సౌజన్య కొడాలి, శ్రీదేవి, లక్ష్మి గుంటు, సుధ ధూళిపాళ్ల, రాణీ మదమంచి తదితరులు పాల్గొన్నారు.