Watermelon: ఇదిగో పుచ్చకాయ ఇలా ఉందంటే.. ఇంజెక్షన్ చేసినట్లు.. కొనకండి
watermelon : సమ్మర్ మొదలయింది. జనం ప్రూట్ జ్యూసుల వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అలానే పండ్లు కూడా కాస్త ఎక్కువ తినడం షురూ చేశారు. ఇక వేసవిలో తినే పండ్లు అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది పుచ్చకాయ. ఈ ప్రూట్ సమ్మర్‌లో ఎంతో మంచింది. అయితే కొందరు దీన్ని కూడా కల్తీ చేస్తున్నారు. అయితే కల్తీ పుచ్చకాయను కనిపెట్టడం ఎలా..?
ఫిబ్రవరిలోనే ఎండలు మండిపోతున్నాయి. దీంతో జనం డైట్ ప్లాన్ మార్చేశారు. హార్డ్ ఫుడ్స్‌కు దూరంగా ఉంటూ.. లిక్విడ్స్, ప్రూట్స్ వంటి చలవ చేసే వాటిపై ఫోకస్ పెట్టారు. ఇక ఎండాకాలం అంటే తప్పకుండా తినాల్సిన ప్రూట్ పుచ్చకాయ. వాటర్ కంటెంట్ అధికంగా ఉండే ఈ పండును పిల్లల్ని నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటుంటారు. అయితే ఈ మధ్య ఈ పండ్లను కల్తీ చేస్తున్నారు కొందరు.
అయితే ఈ మధ్య ఈ పండ్లను కల్తీ చేస్తున్నారు కొందరు. కాయ త్వరగా పండటానికి.. లోపల ఎర్రగా ఉండటానికి ఇంజక్షన్స్ చేయడంతో పాటు కెమికల్స్ వాడుతున్నారు. అలాంటి పండ్లను తింటే హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం పక్కా.. అందుకే పుచ్చకాయను కొనేప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI)’ కల్తీ పుచ్చకాయను ఎలా కనిపెట్టాలనే అంశంపై ఓ వీడియో విడుదల చేసింది.
వీడియో ప్రకారం పుచ్చకాయను కొనే ముందు ఒక చిన్న ముక్క కట్ చేసి ఇవ్వమనాలి. అప్పుడు ఒక క్లాత్ లేదా టిష్యు పేపర్ తీసుకొని కట్ చేసిన ఆ ముక్క లోపలి భాగంపై రుద్దాలి. అలా చేసినప్పుడు ఆ కాటన్ లేదా క్లాత్ ఎరుపు రంగులోకి మారితే అది కల్తీ చేసిన పుచ్చకాయగా చెబుతున్నారు. అదే క్వాలిటీ పుచ్చకాయ అయితే అసలు రంగు మారదంటున్నారు. ఈ చిన్న టెస్ట్తో కల్తీ పుచ్చకాయను కనిపెట్టడంలో బాగా హెల్ప్ అవుతుందంటున్నారు.
మరికొన్ని టిప్స్ విషయానికి వస్తే… పుచ్చకాయ ఫాస్ట్‌గా పండటానికి కార్బైడ్ అనే కెమికల్‌ను వాటిపై చల్లుతారు. అందుకే కాయ పసుపు రంగులో ఉన్నట్టుంటే దాన్ని కాసేపు ఉప్పు నీటిలో ఉంచి.. కడిగి ఆపై తినాలని సూచిస్తున్నారు. అలానే పుచ్చకాయ కొన్ని చోట్ల తెల్లగా.. అక్కడక్కడా పసుపు మచ్చలు ఉంటే ఇంజెక్షన్ చేసి ఉంటారని అర్థం చేసుకోవాలి.