Usha Uthup : టీవీ చూస్తూ.. ప్రముఖ గాయని ఉషా ఉతుప్ భర్త కన్నుమూత

Usha Uthup

Usha Uthup husband

Usha Uthup : ప్రముఖ గాయని ఉషా ఉతుప్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె భర్త జాని చాకో ఉతుప్ (78) సోమవారం రాత్రి కన్నుమూశారు. కోల్ కతాలోని వారి నివాసంలో ఆయన గుండెపోటుతో మరణించారు. టీవీ చూస్తున్న సమయంలో ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆయన కన్నుమూసినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఉషా ఉతుప్ కు కుమారుదు సన్నీ, కుమార్తె అంజలి ఉన్నారు.

ఎలాంటి పాటనైనా తన స్టైల్ లో పాడి అలరిస్తారు ఉషా ఉతుప్. సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు. 1971లో ‘హరేరామ హరేకృష్ణ’ సినిమాలోని పాటతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ‘కీచురాళ్లు‘ టైటిల్ సాంగ్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఉషా ఇక్కడ కూడా చాలా పాటలు పాడారు. అల్లు అర్జున హీరోగా వచ్చిన ‘రేసుగుర్రం’ టైటిల్ సాంగ్ తో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఇప్పటివరకు 15 భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లోనూ ఆమె పాటలు పాడారు. ఆమె సంగీత రంగానికి చేసిన సేవలకు గాను ఇటీవలే భారత ప్రభుత్వం ఆమెను పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది.

TAGS