Rohith Sharma : రోహిత్ భయ్యాకు కోపం వస్తుంది జాగ్రత్త.. వీడియో వైరల్

Rohith Sharma
Rohith Sharma : మార్చి 7న భారత్- ఇంగ్లాండ్ ఐదో టెస్ట్ మ్యాచ్ కు ముందు విరామాన్ని రోహిత్ శర్మ బాగా ఎంజాయ్ చేశాడు. ఈ విరామ సమయంలో అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కు భార్య రితికాతో సహ హాజరయ్యాడు. మూడు రోజుల పాటు ఎంజాయ్ చేశారు.
గుజరాత్ లోని జామ్ నగర్ వేదికగా అత్యంత వైభవంగా జరిగిన వేడుకలు ఆదివారం ముగిసిన నేపథ్యంలో రోహిత్ తిరుగుపయనమయ్యాడు. ఈక్రమంలో జామ్ నగర్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోగానే అభిమానులు, పాపరాజీలు హిట్ మ్యాన్ ను చుట్టుముట్టారు. అయితే అప్పటికే అలసిపోయినట్లు కనిపిస్తున్నా రోహిత్ శర్మ ఫ్యాన్స్ తో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చాడు. అయినా మరికొందరు క్యూ కట్టడంతో అక్కడున్నవాళ్లలో ఒకరు..‘‘ఇప్పుడు రోహిత్ భయ్యాకు కోపం వస్తుంది జాగ్రత్త..’’ అంటూ హెచ్చరించడం ఆసక్తికరంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
కాగా అంబానీల యాజమాన్యంలోని ముంబై ఇండియన్స్ ఐపీఎల్ ఫ్రాంచైజీకి కెప్టెన్ గా వ్యవహరించిన రోహిత్ శర్మ ఐదు సార్లు టైటిల్ అందించాడు. అయితే ఐపీఎల్-2024 కు ముందు అతడి స్థానంలో భారత అల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది మేనేజ్ మెంట్. ఫలితంగా రోహిత్ ఫ్యాన్స్ బాగా మనస్తాపం చెందారు. దీంతో ఇప్పటికీ ముంబై ఇండియన్స్ వ్యవహారశైలిపై విమర్శల పర్వం ఆగడం లేదు.
View this post on Instagram