Pandya : శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్ కోసం టీమిండియా కొలంబో చేరుకుంది. అయితే జట్టు నుంచి నిష్క్రమణకు ముందు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కొత్త హెడ్ కోచ్ గౌతం గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వకపోవడంపై వారిద్దరూ మీడియా ముందు తమ అభిప్రాయాలను కూడా వెల్లడించారు. హార్దిక్ పాండ్యా వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కారణంగానే అతనికి కెప్టెన్సీ రాలేదని ఇద్దరూ చెప్పారు. ఈ నిర్ణయంతో హార్దిక్ పాండ్యా అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. కానీ టీమ్ ఇండియా ఆల్ రౌండర్ పై మాత్రం ఎలాంటి ప్రభావం కనిపించడం లేదు. నటాషా స్టాంకోవిచ్ నుంచి విడాకులు తీసుకొని తర్వాత, హార్దిక్ పాండ్యా మొదటిసారిగా టీమిండియా ఆటగాళ్లను కలుసుకున్నాడు. జట్ట సహచర హృదయాలను గెలుచుకున్నాడు.
సహచరుల మనసు గెలుచుకున్న పాండ్యా
హార్దిక్ పాండ్యా సోమవారం ముంబైలో టీమ్ ఇండియాలో చేరాడు. ముంబై ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయన రాగానే కొత్త అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌ను కౌగిలించుకున్నాడు. హార్దిక్ పాండ్యా నవ్వుతూ, కొన్ని రోజులుగా తన వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితంలో జరిగిన సంఘటనలను అధిగమించి ముందుకు సాగినట్లుగా కనిపించింది. పాండ్యా శ్రీలంకలో టీ20 సిరీస్ మాత్రమే ఆడనున్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల వన్డే సిరీస్ కు దూరంగా ఉంటున్నాడు.
ఎప్పటికీ ప్లేయర్ గా కొనసాగాలనే..
హార్దిక్ పాండ్యా లాంటి ఆటగాడిని కాపాడేందుకు టీమిండియా కెప్టెన్సీ ఇవ్వలేదు. రెండేళ్లుగా పాండ్యా చాలా గాయపడ్డాడని అజిత్ అగార్కర్ చెప్పాడు. ఎప్పుడూ అందుబాటులో ఉండే ఇలాంటి ప్లేయర్ ను టీమిండియా కెప్టెన్‌గా చేయాలని భావించానని, అందుకే సూర్యకుమార్ యాదవ్‌కు ఈ బాధ్యత అప్పగించినట్లు అగార్కర్ స్పష్టం చేశారు.