Deputy CM Pawan Kalyan : గన్నవరం ఎయిర్ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం

Deputy CM Pawan Kalyan
Deputy CM Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కు గన్నవరం ఎయిర్ పోర్టులో జనసేన నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో పార్టీ కార్యాలయానికి బయల్దేరారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు ఏపీ సచివాలయంకు రానున్నారు. ఈ సందర్బంగా అమరావతి రైతులు మరియు జనసేన, టిడిపి, బిజెపి కార్యకర్తలు ఘనంగా స్వాగత ఎర్పాట్లు చేస్తున్నారు. అసెంబ్లీ గేట్ కుడా తాక లేవు అన్నవాళ్ళకి సమాధానంగా పూల వర్షంతో సచివాలయంలోకి పవన్ అడుగుపెట్టన్నారు.
ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మొదటిసారి సచివాలయానికి రానున్న ఆయన రెండో బ్లాక్ లోని తన ఛాంబర్ ను పరిశీలించనున్నారు. ఉపముఖ్యమంత్రిగా బుధవారం తన ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించనున్నారు. సీఎం చంద్రబాబును ఆయన మర్యాదపూర్వకంగా కలిసే అవకాశం ఉంది.