Warangal History : వరంగల్ చరిత్రను కనుమరుగు చేసేందుకే జిల్లా ఆరు ముక్కలు: కడియం శ్రీహరి

Warangal History, Kadiyam Sri Hari
Warangal history : వరంగల్ చరిత్రను కనుమరుగు చేసేందుకే జిల్లాను ఆరు ముక్కలు చేశారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. తెలంగాణలో అవినీతి, అక్రమాలకు మారుపేరు బీఆర్ఎస్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. జిల్లాను ముక్కలు చేయవద్దని అన్నందుకే తనకు రెండోసారి మంత్రి పదవి ఇవ్వలేదని పేర్కొన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బీఆర్ఎస్ ప్రభుత్వం కాలరాసింది. అవినీతి, అక్రమాలకు బీఆర్ఎస్ మారుపేరని అన్నారు. వరంగల్ చరిత్రను కనుమరుగు చేయాలనే కుట్రతోనే కేసీఆర్ జిల్లాను ఆరు ముక్కలు చేశారని విమర్శించారు. దీనిపై ప్రశ్నించినందుకే తనకు రెండోసారి మంత్రి పదవి ఇవ్వలేదని పేర్కొన్నారు.
‘‘కేసీఆర్ కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయింది. బీఆర్ఎస్ నేతలు సిగ్గు లేకుండా ఇప్పుడు పార్టీ ఫిరాయింపులపై మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఏకంగా శాసనసభ పక్షాలను కలుపుకున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. ఇప్పట్లో తెలంగాణలో ఉప ఎన్నికలు రావు. ఒకవేళ వచ్చినా ఎదుర్కునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. స్టేషన్ ఘనపూర్ లో ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ కు డిపాజిట్ కూడా రాదు. కోర్టులు, ప్రజాస్వామ్యంపై మాకు గౌరవం ఉంది’’ అంటూ వ్యాఖ్యానించారు.