Bhadrakali : అన్నపూర్ణ దేవిగా వరంగల్ భద్రకాళి.. భారీగా భక్తుల రద్దీ

Bhadrakali as Annapurna Devi
Bhadrakali as Annapurna Devi : ఓరుగల్లులోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా అర్చకులు అమ్మవారికి అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారిని అన్నపూర్ణగా సర్వాంగ సుందరంగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయ ప్రాంగణంలోని క్యూ లైన్లలో బారులు తీరారు. భద్రకాళీ నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. పెరిగిన రద్దీతో ఆలయం కిక్కిరిసిపోయింది.