Israeli PM Netanyahu : హమాస్ మిలిటెంట్ అధినేత యహ్యా సిన్వర్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. తమ బందీలను వదిలిపెడితే రేపే యుద్ధం ముగిస్తామని చెప్పారు. గాజా పౌరులను ఉద్దేశిస్తూ నెతన్యాహు కీలక కామెంట్స్ చేశారు. హమాస్ తమ ఆయుధాలను వదిలేసి, మా బందీలను తిరిగి పంపించాలని కోరారు. అదే విధంగా తమ పౌరులను వదిలిన హమాస్ తీవ్రవాదులకు బయటకు వచ్చి జీవించే అవకాశం కల్పిస్తామని నెతన్యాహు హామీ ఇచ్చారు. లేదంటే వేటాడి మరీ ఒక్కొక్కరిని హతమారుస్తామని ఆయన హెచ్చరించారు.
హమాస్ మిలిటెంట్ గ్రూప్ అధినేత సిన్వర్ మృతిపై అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ స్పందించారు. సిన్వర్ మరణంతో న్యాయం జరిగిందని వ్యాఖ్యానించారు. అలాగే ఇది గాజాతో యుద్ధం ముగింపు పలికేందుకు మంచి అవకాశంగా భావిస్తున్నామన్నారు. ‘ఇజ్రాయెల్ సురక్షితంగా ఉంటుంది. బందీలు విడుదలవడంతో పాటు గాజాలో బాధలు తొలగిపోతాయి’ అని హారిస్ పేర్కొన్నారు.