Vyuham:చెడ్డవాళ్లకు బ్యాడ్ న్యూస్ అంటూ RGV ఝ‌ల‌క్

Vyuham:రామ్ గోపాల్ వర్మ వ్యూహం విడుదలకు రాజ‌కీయ వైరి వ‌ర్గాలు మోకాల‌డ్డిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాపై వివాదాలు ఇబ్బందిక‌రంగా మారాయి. ఎట్ట‌కేల‌కు ఇప్పుడు రిలీజ్‌కి క్లియరెన్స్ వచ్చింది. సెన్సార్ బోర్డు సినిమాకు యు సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆర్జీవీ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్ల‌డించారు. ఈ నెల 29న సినిమాను విడుదల చేయనున్నట్టు ఆయన ప్రకటించారు.

ఇక ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ రావడంపై వర్మ తనదైన శైలిలో స్పందించారు. చెడ్డవాళ్లకు బ్యాడ్ న్యూస్ అంటూ ఎక్స్ లో మెసేజ్ పెట్టాడు. త‌న సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని ఈనెల 29న విడుద‌ల‌వుతంద‌ని తెలిపాడు. అజ్మల్, మానస జంటగా వర్మ దర్శకత్వంలో దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన చిత్రం వ్యూహం. ఈ సినిమాను అడ్డుకునేందుకు కొంత మంది చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమా విడుదలకు అనుమతి ఇవ్వొద్దంటూ టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సెన్సార్ బోర్డుకు లేఖ కూడా రాశారు. ఆ సమయంలో ఆర్జీవీ ఘాటుగా స్పందించారు.

`మీరు మీ అరచేతితో సూర్యకాంతిని నిరోధించలేరు. అలాగే మా `వ్యూహం సినిమా విడుదలను ఆపలేరు. ఈలోగా మా సినిమాపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేయకుండా నా ముందుకు వచ్చి మాట్లాడనివ్వండి. మా సినిమా విడుదలకు అడ్డంకులు ఎదురైతే ఏం చేయాలనే వ్యూహంతో ఉన్నాం“’ అని సవాల్ కి ప్ర‌తి స‌వాల్ చేసారు. వ్యూహం చిత్రంలో వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆయ‌న అనుచ‌రులు, నారా చంద్ర‌బాబు నాయుడు, నారా లోకేష్ నాయుడు, ప‌వ‌న్ క‌ల్యాణ్ లాంటి ప్ర‌ముఖుల పాత్ర‌లు ఉన్నాయి. దీంతో రిలీజ్ కి అడ్డంకులు ఏర్ప‌డ్డాయి. ఎట్ట‌కేల‌కు సెన్సార్ క్లియ‌రెన్స్ ఇచ్చింది.

TAGS