YS Sharmila : సీఎం జగన్ పార్టీ వైసీపీ, చంద్రబాబు పార్టీ తెలుగుదేశం పార్టీలకు ఓటేస్తే డ్రైనేజీలో వేసినట్లేనని వైఎస్ షర్మిల అన్నారు. ఆ ఇద్దరు నాయకులు కలిసి ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేశారని ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆరోపించారు. ఆమె ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ఇప్పటి వరకు ప్రత్యేక హోదాను సాధించలేకపోయిన పార్టీలకు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. చంద్రబాబు త్రీడీ సినిమా చూపిస్తే, 3 రాజధానుల పేరిట జగన్ రాష్ట్రాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రత్యేక హోదా ఇస్తుందని షర్మిల తెలిపారు.
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో జనవరి 4న విలీనం చేశారు. ఆమెకు కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ అధ్యక్ష పదవిని అప్పగించింది. అప్పటి నుంచి షర్మిల కాంగ్రెస్ పార్టీ తరపున విస్తృత ప్రచారం చేస్తున్నారు.