Voters Alerts-Wolf Party : మరోసారి నమ్మితే.. మన షింగల్ సిమ్మం కూడా ఇలాగే.. గోచి కూడా మిగల్చదు..
Voters Alerts-Wolf Party: ఒక్క చాన్స్ ఇవ్వండి..అంటూ 2019 ఎన్నికల్లో ప్రాథేయపడి అధికారంలోకి వచ్చిన జగన్ ఏపీ ప్రజల రక్తం పీల్చాడు. మరోసారి తనకు అధికారం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా అంటూ నమ్మబలుకుతున్నాడు. ఇప్పటికే రాష్ట్రంలో రక్తచరిత్రను చూసిన ప్రజలు మరోసారి జగన్ మాటలను నమ్మితే సింహం శాఖహారిగా మారుతానని చెప్తే విన్న గొర్రెల చందంగా జనం మోసపోవడం ఖాయం.
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించాడు. ఉద్యోగాలు లేవు.. ఉపాధి లేదు.. మౌలికసదుపాయాలు కల్పించలేదు..గుంతల రోడ్లు..డొక్కు బస్సులు..పరిశ్రమలను తేలేదు..ఉన్నవి బయటకు పోయాయి.. ప్రాజెక్టులు కట్టలేదు..గుక్కెడు మంచినీళ్లు అందివ్వలేదు..పంటకు చుక్క నీరు అందలేదు.. గుడుల ఆదాయం మింగారు..దేవుడి విగ్రహాలను ధ్వంసం చేశారు..
మెగా డీఎస్సీలంటూ దగా చేశారు..కార్పొరేషన్ పదవుల్లో తమ సామాజిక వర్గంతోనే భర్తీ చేశారు..ఇసుక దందాలు, మైనింగ్ మాఫియాలు.. రాజారెడ్డి రాజ్యాంగంతో రక్తచరిత్ర రాశారు.. అమరావతిని అడ్డుకుని మూడు రాజధానుల డ్రామా ఆడారు.. ఇలా ఒక్కటేమిటి అన్ని వ్యవస్థలు నాశనం చేశారు. చేసిన మంచి పని ఒక్కటన్నా లేదు కానీ చెడ్డ పనులు చెప్పాలంటే ఒక్క రోజు సరిపోదు..ఒక్క పేజీ సరిపోదు.
యువకుడు కదా ఒక్కసారి చాన్స్ ఇద్దామనుకుని ప్రజలు గొర్రెల్లా నమ్మి ఓట్లేశారు. ఫలితం ఏమైంది. ఐదేండ్లలో ప్రజలకు ఒరిగింది ఏముంది. ఓ నాలుగు సంక్షేమ పథకాలు తప్ప. ఆ పథకాల పేరిట ఇచ్చిన డబ్బు ఎవరిది? మనదే కదా. వివిధ పన్నుల రూపేణా మన ముక్కుపిండి వసూలు చేసిన డబ్బే కదా. ఓ చేత్తో రూపాయి ఇచ్చి.. మరో చేత్తో వంద రూపాయలు గుంజారు కదా. ఇంకెక్కడి సంక్షేమం. ప్రజలకు ఏం మిగిలిందని.
ఉపాధి దొరకలేదు.. సంపాదన లేదు..దిక్కుతోచని పరిస్థితుల్లో రాజధానంటూ లేకపోవడంతో పక్క రాష్ట్రాల్లో బిక్కుబిక్కుమంటూ ఏ తాపీమేస్త్రీగానో, లేదా ఏ టిఫిన్ సెంటరో పెట్టుకుని బతుకులు ఇడుస్తున్నారు.
మరి ఈసారి కూడా అలాగే జనం నమ్మితే ఒంటిపై బట్టలను కూడా గుంజేసుకుంటారు ఈ పాలకులు. గత ఐదేండ్ల చేయలేనిది.. వచ్చే ఐదేండ్లలో చేస్తామంటే నమ్మితే ఇక అంతే. ఏపీ ప్రజలను కాపాడేవారు ఎవరూ లేరు. వారి రాతను వారు మార్చుకోవాల్సిందే. గొర్రెల్లా మళ్లీ ఈ పాలకుల మాట నమ్మితే ఇక గోచి కూడా ఉండదు.