Vote : ఇంటి పెద్దదిక్కును కోల్పోయినా ఆ కుటుంబం ఓటు బాధ్యతను విస్మరించలేదు. కుటుంబ సభ్యలు ఓటు వేశాకే అంత్యక్రియలు నిర్వర్తించారు. ఓటు అంటే బాధ్యత. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని నిర్వర్తించాలని, పుట్టెడు దు:ఖంలో ఉన్న ఓ కుటుంబం నిరూపించింది. ఇంటి పెద్ద కన్నుమూసినా.. ఓటు వేశాకే అంత్యక్రియలకు సిద్ధమైంది. బాధ్యతను మరవని ఆ కుటుంబం ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బిహార్ లో ఈరోజు (శనివారం) పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే జెహనాబాద్ నియోజకవర్గంలోని దేవుకురి గ్రామంలో ఓ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఒకవైపు ఎన్నికల పండగ జరుగుతుండగా.. మరోవైపు మిథిలేశ్ యాదవ్ అనే గ్రామస్థుడి తల్లి (80) మృతి చెందింది. ఇంటి పెద్దను కోల్పోయి దు:ఖంలో ఉన్న ఆ కుటుంబం తమ బాధ్యతను వీడలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఒక నిర్ణయానికి వచ్చారు.
ఓటుహక్కు వినియోగించుకున్న తరువాతే ఆమె అంత్యక్రియలు నిర్వహించాలనుకున్నారు. వారు తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో మందికి ప్రజాస్వామ్య ప్రాధాన్యాన్ని తెలియజేసింది. కాగా, చివరి విడతలో భాగంగా 57 లెక్ సభ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. బిహార్ లోని ఎనిమిది స్థానాలకు ఈరోజు ఓటింగ్ జరుగుతోంది.