Nara Rohit : కూటమి అభ్యర్థులను గెలిపించండి: నారా రోహిత్

Nara Rohit
Nara Rohit : ప్రజలు ఎన్డీయే కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని, రాష్ట్రంలో రాక్షస పాలనను అంతమొందించాలని సినీ నటుడు నారా రోహిత్ అన్నారు. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం పరిధిలోని చెరుకుపల్లి కూటమి అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ తో కలిసి నారా రోహిత్, హాస్య నటుడు రఘు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్డీయే కూటమి గెలిస్తే రాష్ట్ర అభివృద్ధి బాధ్యతలను చంద్రబాబు తీసుకుంటారని అన్నారు. ఉమ్మడి ఏపీలో ఆయన ఎంతో అభివృద్ధి చేశారని గుర్తుంచుకోవాలన్నారు. పవన్ సినిమాలో ‘లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా’
అన్నట్లు ప్రజల ఓటు పంచ్ తో ఫ్యాన్ రెక్కలు తెగిపడిపోవాలన్నారు.
అనంతరం హాస్యనటుడు రఘు మాట్లాడుతూ వారసత్వంగా వచ్చిన ఆస్తులపై జగన్ ఫొటో ఎందుకని, మన భూమి మీద జగన్ హక్కు ఏమిటని ప్రశ్నించారు. యువతకు ఉద్యోగాలివ్వాలని, చేపలు, గొర్రెలు ఇవ్వడం కాదన్నారు. కంపెనీలుయ వస్తే యువతకు ఉద్యోగాలతో పాటు అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ ఎన్నికల్లో కూటమిని గెలిపిస్తే ప్రజల భవిష్యత్ బాగుంటుందని అన్నారు.