Vote For Good Governance : వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. ఎవరితోనూ పొత్తు ఉండదని జగన్ చెబుతున్నారు. తమకు ప్రజలతోనే పొత్తు ఉంటుందని ఇతరులతో ఉండదని ప్రకటించారు. ఎవరు పనిచేస్తారో ఎవరు చేయరో ప్రజలకు తెలుసంటున్నారు. ఎన్నికల క్షేత్రంలో ప్రజలను మోసం చేయడానికి రకరకాల వేషాలతో వస్తారు. కానీ వారిని నమ్మొద్దని చెబుతున్నారు
సినిమాల్లో డైలాగులు చెప్పినట్లు సింహం సింగిల్ గానే వస్తుందంటున్నారు. ఎంతో మందికి నేరుగా నగదు బదిలీ చేస్తూ లబ్ధి చేకూరుస్తున్నారు. దేవుడి దయతో ధైర్యంగా ఎన్నికల్లో నిలబడతాను. మీ బిడ్డననే ధైర్యంతో ముందడుగు వేస్తాను. ఇతర పార్టీలు వచ్చినా ఎవరు మంచి పాలన అందిస్తారో తేల్చుకుని ఓటు వేయాలని కోరుతున్నారు. గజదొంగల ముఠా, దత్తపుత్రుడు కలిసి ఏకమై వచ్చి మోసం చేసేందుకు సిద్ధపడతారు. కానీ మీరు ఆలోచించాలని సూచిస్తున్నారు.
కుట్రలు, కుతంత్రాలకు తావు లేకుండా స్వచ్ఛమైన పాలన అందించడమే తమ పాలన లక్ష్యం. చిత్తశుద్ధితో పనిచేయడమే నాకు అలవాటు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవలు చేయడమే తెలుసు. 53 నెలల కాలంలో రూ.4.10 లక్షల కోట్లు పేదలకు అందజేశాను. 80 శాతం మందికి ప్రయోజనం కలిగించాను. పేదలకు సేవ చేయడమే తన లక్ష్యం అంటున్నారు.
ప్రజలను మోసం చేయడం తెలియదు. వారికి అన్ని సదుపాయాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాను. మరింత మెరుగైన పాలన అందించేందుకు ఇంకా ప్రయత్నాలు చేస్తున్నాను. 2014 నుంచి 2019 వరకు పాలించిన చంద్రబాబు పాలనలో ఏ మేరకు పని చేశారో మీకే తెలుసు కదా అని పేర్కొన్నారు. తాను తీసుకొచ్చిన పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారు.