92 year old man : తొలిసారి ఓటు.. 92 ఏళ్ల వృద్ధుడి ఆనందం
92 year old man : ఝార్ఖండ్ లోని సాహిబ్ గంజ్ కు చెందిన ఖలీల్ అన్సారీ. తన 92 ఏళ్ల వయసులో తొలిసారి ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఎట్టకేలకు తన జీవితంలో తొలిసారి ఓటుహక్కును వినియోగించుకోవడంతో ఆయన ఆనందానికి అంతేలేకుండా పోయింది. దృష్టి లోపంతో బాధపడుతున్న ఆయన రాజ్ మహల్ పార్లమెంటు నియోజకవర్గ పరిధి మండ్రోలోని పదో నంబరు పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.
ఈ ఏడాది ఏప్రిల్ లో మండ్రో పోలింగ్ కేంద్రాల్లో రాష్ట్ర ఎన్నికల అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఖలీల్ అన్సారీ తనకు ఓటు లేదని, ఇప్పటి వరకు అసలు ఓటే వేయలేదని తెలిపారు. దీంతో వెంటనే ఆయన పేరును ఓటరు జాబితాలో చేర్చాలని ఝార్ఖండ్ సీఈవో రవికుమార్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు అన్సారీ వివరాలు నమోదు చేశారు.
‘‘మొట్టమొదటి సారి ఓటుహక్కును వినియోగించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అని ఓటు వేసిన తర్వాత అన్సారీ ఆనందంతో తెలిపారు. ఎన్నికల చివరి దశలో భాగంగా శనివారం ఝార్ఖండ్ల్ లోని మూడు నియోజకవర్గాల్లో (దుమ్కా, రాజ్ మహల్, గొడ్డా) పోలింగ్ కొనసాగుతోంది.