AP Elections 2024 : నేనున్నా అనేవారికి నిర్భయంగా ఓటెయ్యండి..
AP Elections 2024 : ప్రజల అవసరాలను తీర్చడానికి, వారిని మరింత అభివృద్ధి చేయడానికి నిర్మించిన ఒక ప్రాజెక్ట్ కూలిపోయింది. నీటి ప్రవాహానికి కొట్టుకు పోయింది. ప్రాజెక్ట్ కూలిపోయిందనే విషయం తెలియగానే రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే సంఘటన జరిగిన ప్రదేశానికి చేరుకోవాలి. ప్రజలను ఓదార్చాలి. నేను ఉన్నా అంటూ అభయం ఇవ్వాలి. వారికి కావలసిన అవసరాలను తీర్చాలి. ఇవేవి చేయకుండా ఆనందంగా తన రాజభవనంలో విశ్రాంతి తీసుకోవడం ప్రజల మనిషిగా చెప్పుకునే సీఎం జగన్ కె చెల్లుతుంది. ఈ సంఘటన జరిగిన కొద్దీ రోజులకు మీడియాకు ఆంధ్ర ప్రదేశ్ అధినేత జగన్ కనిపించారు. డ్యామ్ కొట్టుకుపోవడం, ఆ సంఘటనతో ప్రజల ఇబ్బందుల గురించి ఆ ప్రజల నేతను అడిగితే ఒక్కటే సమాధానం రావడం విశేషం. ఇంతకు ఆయన ఏమన్నారంటే సీఎం అక్కడికి వెళితే పనులకు అడ్డం అవుతుంది. పనులు చేసేవారికి ఆటంకం ఏర్పడుతుంది అందుకనే అక్కడికి వెళ్లలేదని సుతి మెత్తగా మీడియా కు జవాబు ఇచ్చి జారుకున్నారు. ఇంతకు ఏ డ్యామ్ అనుకుంటున్నారు . అది కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్ట్ . అలాంటివి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కోకొల్లలు .
ప్రభుత్వ నిర్లక్ష్యం కరోనా సమయంలో స్పష్టంగా కనిపించింది. ఆ నిర్లక్ష్యాన్ని సీరియల్ గ చెప్పుకోవచ్చు. తిరుపతి ఆసుపత్రిలో రోగులకు సకాలంలో ఆక్షిజన్ అందక పోవడంతో ఎంతో మంది విలువైన ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. ఇది ఇలా ఉండగా సకాలంలో వైద్యం అందక వేలల్లోనే చనిపోయిన వారు ఉన్నారనే ఆరోపణలు కరోనా సమయంలో వ్యక్తమయ్యాయి. రెండో దశ కరోనా సమయంలో వైద్యం అందక లెక్కపెట్టలేనన్ని ప్రాణాలు కోల్పోయారు. కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలను ఆదుకోడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఆ నిధులను కూడా సక్రమంగా సద్వినియోగం చేసుకోవడంలో జగన్ ప్రభుత్వం విఫలమైనది. కరోనా బాధితులకు రెండు మాస్క్ లు ఇస్తామని ప్రకటించి కనీసం ఒక మాస్క్ కూడా ఇవ్వలేని పరిస్థితి తెచ్చుకొంది ప్రభుత్వం.
కరోనా జబ్బు నయం అయినా వారికీ రెండువేల రూపాయలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం నయాపైసా కూడా ఇవ్వకుండా ఆసుపత్రి నుంచే ఇంటికి వెళ్లగొట్టింది. చనిపోయిన వారి కుటుంబాలకు పదిహేను వేళా రూపాయలు ఇస్తామని చెప్పిన సీఎం జగన్ ప్రభుత్వం కనీసం ఓదార్చడానికి కూడా ప్రభుత్వం పెద్దలు ఎక్కడ కూడా రాష్ట్రంలో కనిపించలేదు. కడప జిల్లాకు తుఫాన్ ప్రమాదం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ సమయంలో కేరళ కు చెందిన ఒక పార్లమెంట్ సభ్యుడు కడపలోనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ అధికారులు ఎలా పనిచేస్తున్నారో తెలుసుకుందామని కడప కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. కానీ కలెక్టర్ కార్యాలయంలో ఒక్కరు కూడా లేరు. దింతో ఆయన అక్కడ ఉన్న ఒకరిని అడుగగా సర్ ఈ రోజు రెండో శనివారం కాబట్టి కార్యాలయానికి ఎవరు రారు అని సెలవిచ్చారు. ఆ సమయంలో వచ్చిన తుఫాన్ కారణంగా కడప జిల్లా ప్రజలు ఎంతో నష్టపోయారు.