Seat Belt : లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన వోల్వోకు 3-పాయింట్ సీట్ బెల్ట్
Seat Belt : కార్ సీట్ బెల్ట్‌లు ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన ట్రాఫిక్ భద్రతా ఆవిష్కరణగా పరిగణిస్తారు. కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు సీటు బెల్ట్ ధరించడం చాలా ముఖ్యం. ప్రస్తుతం సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధం. ఈ సీటు బెల్ట్ 20 లక్షల మందికి పైగా ప్రాణాలను కాపాడిందని అంచనా. ఈ సీటు బెల్టు వల్ల ప్రజల ప్రాణాలు కాపాడినట్లు చాలా రోడ్డు ప్రమాదాల్లో కనిపించింది. డ్రైవర్లు , ప్రయాణీకులు తమ సీటు బెల్టులను పెట్టుకోకపోతే ప్రమాదాల సంఖ్య రెట్టింపు అవుతుంది. ఎంతో మంది ప్రాణాలను కాపాడినందుకు వోల్వో, ఇంజినీర్ నీల్స్ బోహ్లిన్‌కు ప్రపంచం కృతజ్ఞతలు చెప్పుకుంటుంది.
పూర్తిగా సురక్షితమైన సీటు బెల్ట్‌ను కనిపెట్టిన వ్యక్తి పేరు నీల్స్ బోహ్లిన్. మొదట్లో వోల్వో మాత్రమే సీటు బెల్ట్‌ను తమ కార్లలో అంతర్భాగంగా అమర్చింది. అదనపు ఛార్జీ లేకుండా కారుతో పాటు దానిని విక్రయించడం ప్రారంభించింది. కాబట్టి వోల్వో తన వాహనాల్లో ఆ సీట్ బెల్ట్‌ను ఇన్‌స్టాల్ చేయడం.. అంతకుముందు అదనపు డబ్బు చెల్లించాల్సిన కస్టమర్లకు ఎందుకు ఉచితంగా అందించిందో చూద్దాం.
ఆధునిక సీట్ బెల్ట్ అంటే 3 పాయింట్ సీట్ బెల్ట్‌ను స్వీడన్‌కు చెందిన నీల్స్ బోహ్లిన్ 1959లో కనుగొన్నారు. కానీ మొదట దాని డిజైన్‌ను కనుగొన్న ఘనత మాత్రం సర్ జార్జ్ కెల్లీకి దక్కింది. 1800లో అతను తన గ్లైడర్ కోసం సీటు బెల్ట్‌ను కనుగొన్నాడు. కార్ల కోసం మొదటి సీట్ బెల్ట్‌ను అమెరికన్ ఆవిష్కర్త ఎడ్వర్డ్ క్లాఘోర్న్ రూపొందించారు. ఇది 1885లో న్యూయార్క్ టాక్సీలలో ఉపయోగించడం ప్రారంభమైంది. కాలక్రమేణా, సీటు బెల్ట్ రూపకల్పన, దాని ఉపయోగం రెండూ చాలా మారాయి. డా. షెల్డన్ రూపకల్పన తర్వాత.. సీట్ బెల్ట్‌లు బాగా ప్రాచుర్యం పొందాయి. దాదాపు 1950లలో దాదాపు అన్ని రేసింగ్ కార్లలో వీటిని ఉపయోగించారు. చాలా చోట్ల రేసింగ్ కార్లకు సీటు బెల్ట్ తప్పనిసరి చేశారు. సీట్ బెల్ట్‌లో చాలా మార్పులు వచ్చాయి.
గన్నార్ ఎంగెల్లావ్ పాత సీట్ బెల్ట్ లోపాలను గుర్తించారు. దీంతో ప్రమాద సమయంలో ప్రజల ప్రాణాలను రక్షించడంలో సహాయపడే సురక్షితంగా ఉండే సీటు బెల్ట్‌ను రూపొందించగల వ్యక్తి అవసరమని భావించారు. తను ప్రమాదంలో గాయపడడంతో తేరుకున్న ప్రత్యర్థి సంస్థ సాబ్ నుండి నిల్స్ బోహ్లిన్‌ను సురక్షిత సీట్ బెల్ట్ డిజైన్ కనుగొనడానికి వోల్వోకు నియమించాడు. ఇంకా, నీల్స్ సహాయంతో వోల్వో పాత సీట్ బెల్ట్‌లు ఎదుర్కొంటున్న సమస్యలకు మెరుగైన పరిష్కారాన్ని కనుగొంది. దీని తర్వాత వోల్వో తన కార్లలో 3 పాయింట్ల సీట్ బెల్ట్‌లను తప్పనిసరి చేసింది. 3-పాయింట్ సేఫ్టీ బెల్ట్‌లు వందల వేల మంది ప్రాణాలను కాపాడాయి. ఈ సీట్ బెల్ట్ లక్షలాది మంది ప్రాణాంతకమైన గాయాల నుండి రక్షించింది. అందుకే 130 ఏళ్ల ఆటోమొబైల్ చరిత్రలో ఇది అత్యంత ముఖ్యమైన ఆవిష్కరణగా పరిగణిస్తారు.