YCP-Volunteers : వైసీపీకి మొహం చాటేస్తున్న వలంటీర్లు..తలలు పట్టుకుంటున్న నేతలు..

YCP-Volunteers

YCP-Volunteers

YCP-Volunteers : ఆంధ్రప్రదేశ్ లో ప్రచారం ఊపందుకుంది. జగన్ బస్సు యాత్ర ద్వారా ప్రజలను కలుసుకునేందుకు వెళ్తున్నారు. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత రావడంతో జగన్ కు అధికారం అంత సులభం కాదని తెలుస్తోంది. మళ్లీ అధికారం దక్కించుకోవాలని చూస్తున్నా కుదరడం లేదని అంటున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి.

ఎన్నికల సంఘం వలంటర్ల వ్యవస్థను ఎన్నికల్లో వాడుకోవద్దని  చెప్పడంతో చాలా మందే రాజీనామా చేశారు. వైసీపీ గెలుపు కోసం పనిచేయాలని వైసీపీ సూచించగా కొందరు వలంటీర్లు ససేమిరా అంటున్నారు. ప్రచారానికి రావడానికి సంకోచిస్తున్నారు. కూటమి అధికారంలోకి వస్తే పారితోషికం పెంచుతామని చెప్పడంతో వలంటీర్లు వైసీపీకి మద్దతుగా ఉండటం లేదు. కొందరు కూటమి తరఫున ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది.

వైసీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నా కుదరదని చెబుతున్నారు. కూటమి కోసం ప్రచారం చేస్తే ఫలితం ఉంటుందని భావిస్తున్నారు. అందుకే వైసీపీకి దూరంగా ఉంటున్నారు. మునిగిపోయే నావ ఎక్కినా దిగినా ఏం లాభం అని ప్రశ్నిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో టీడీపీ కూటమే అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈనేపథ్యంలో వలంటీర్లు కూటమికే మద్దతు తెలపడం విశేషం.

దీంతో వైసీపీ నేతలకు పాలుపోవడం లేదు. ఉన్న దారులన్నీ మూసుకుపోవడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. వలంటీర్ల సాయంతో గట్టెక్కాలని భావించినా అది సాధ్యం కాలేదు. దీంతో విజయం కోసం ఏం చేయాలనే దానిపై తర్జనభర్జనలు పడుతోంది. వలంటీర్లను స్వయంగా వైసీపీ అభ్యర్థులు కోరుతున్నా పాజిటివ్ రియాక్షన్ కనిపించడం లేదు.

అనుకున్నదొక్కటి అయ్యింది ఒక్కటి బోల్తా కొట్టింది లే బుల్ బుల్ పిట్ట అనుకుంటున్నారు. విజయం కోసం అన్ని దారులు తెరుస్తాయనుకుంటే మూసుకుపోవడం జీర్ణించుకోలేకపోతున్నారు. వైసీపీకి పరాభవం తప్పదని తెలిసిపోయింది. దీంతో తికమకపడుతున్నారు. అధికారం కోల్పోతే ముఖం ఎలా చూపించుకోవాలని భయపడుతున్నారు.

TAGS