VJ Sunny : వీజే సన్నీ కల నిజమైన వేళ.. సెలూన్ బిజినెస్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ

VJ Sunny

VJ Sunny

VJ Sunny : బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విన్నర్ వీజే సన్నీ బార్బర్ క్లబ్ (టీబీస్) సెలూన్ ఫ్రాంచైజీని హైదరాబాద్ లోని మాదాపూర్ లో ప్రారంభించారు.  జులై 14న మాదాపూర్ లో ఈ సెలూన్ ఓపెనింగ్ గ్రాండ్ గా జరగ్గా.. ఈ కార్యక్రమానికి సెలబ్రెటీలు క్యూ కట్టారు. టాలీవుడ్ టాప్ హిరో శ్రీకాంత్, తరుణ్ పాల్గొన్నారు. వీరితో పాటు బిగ్ బాస్ తారలు సోహైల్, ఆర్జే కాజల్, దీప్తి సునయన, మానస్ అటెండ్ అయ్యారు. వీజే సన్నీకి బార్బర్ క్లబ్ (టీబీస్) పెట్టడం డ్రీమ్.

దీనికి సంబంధించి నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. అన్న కంగ్రాట్స్ ఆల్ ది బెస్ట్ అంటూ ఎంకరేజ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అందరూ అభినందనలు తెలిపారు. ఈ షాప్ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచే ఉంటుందని పేర్కొన్నారు.

వీజే సన్నీ మొదట్లో టీవీ యాంకర్ గా జర్నలిస్టులుగా పని చేశారు. అనంతరం నటనపై ఇష్టం పెంచుకుని సినీ రంగం వైపు మరిలారు. కల్యాణ వైభోగమే సీరియల్ లో  సన్నీ పాత్రకు మంచి పేరు వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 5 లో కూడా గెలిచి తన పేరును విన్నర్ గా లిఖించుకున్నాడు. బిగ్ బాస్ 5 తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితుడిగా మారిపోయాడు.

మంచి అవకాశాలు రావడంతో కొన్ని సినిమాల్లో హిరోగా కూడా నటించాడు. సకల గుణాభిరామ, అన్ స్టాపబుల్ , సౌండ్ పార్టీ సినిమాలో కనిపించాడు. వీజే సన్నీ చేసిన ఏటీఎం వెబ్ సిరీస్ జీ 5 భారీ వ్యూస్ సొంతం చేసుకున్నారు.
బిగ్ బాస్ లో వీజే సన్నీ ఆడిన ఆటతో ప్రేక్షకుల మనసును దోచుకున్నారు. హిరోగా చేస్తూనే ఇప్పుడు సెలూన్  బిజినెస్ రంగంలో కి దిగారు. దీంతో అందరూ వీజే సన్నీకి కంగ్రాట్స్ చెబుతున్నారు.

TAGS