Vizianagaram : విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నోటిఫికేషన్ రద్దు

Vizianagaram : విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు జారీ చేసిన నోటిఫికేషన్ ను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. ఏపీ హైకోర్టు ఉత్తర్వుల మేరకు నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ ఈ మేరకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై మండలి ఛైర్మన్ అనర్హత వేటు వేశారు. మండలి ఛైర్మన్ నిర్ణయాన్ని రఘురాజు హైకోర్టులో సవాల్ చేశారు. మండలి ఛైర్మన్ నిర్ణయాన్ని తప్పుబట్టిన ఉన్నత న్యాయస్థానం, అనర్హత వేటు చెల్లదని తీర్పు ఇచ్చింది. అతను ఎమ్మెల్సీగా కొనసాగవచ్చని తీర్పు ఇచ్చింది. దీంతో ఉపఎన్నిక నోటిఫికేషన్ ను రద్దు చేస్తున్నట్టు ఈసీ ప్రకటించింది.
TAGS