Viveka Murder Case : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం రోజుకోతీరు మారుతోంది. అమావాస్య,పౌర్ణమి మాదిరిగా ఎన్నికల ప్రచారం సాగుతోంది.ఒకవైపు కాంగ్రస్ అధ్యక్షురాలు షర్మిల, మరోవైపు కూటమి భాగస్వాములైన జనసేన,తెలుగుదేశం,భారతీయ జనతా పార్టీ లు వైసిపి పార్టీ పై విమర్శలు గుప్పిస్తున్నాయి. జగన్ కూడా అదేరీతిలో ఎదురుదాడికి సిద్దపడి తన అభ్యర్థులను గెలిపించుకోడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు.ముక్యంగా కడప జిల్లాలో రాజకీయాలు సంచలనం అవుతున్నాయి.
జగన్ చిన్నాన్న , మాజీ మంత్రి వై ఎస్ వివేకా నంద రెడ్డి హత్య కేసును కూటమి పార్టీలతోపాటు కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కూడా అస్త్రాలుగా ఉపయోగించుకున్నాయి. హత్య కేసును పావుగా వాడుకున్నాయి. ఈ కేసు తో జగన్ ఇరుకున పడిపోవడంతోపాటు ఆయన అభ్యర్థులు కూడా తలపట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ నేపథ్యంలో వైసిపి నేతలు హత్య కేసును అడ్డుపెట్టుకొని ఆరోపణలు చేయడం సరికాదంటూ కోర్ట్ కు వెళ్లారు. కోర్ట్ కూడా వైసిపి నేతలకు అనుకూలంగా ఆదేశాలు ఇచ్చింది. దింతో జగన్ తో పాటు, వైసిపి నేతలకు ఉపశమనం కలిగింది.కోర్ట్ తీర్పు వైసీపీ కి అనుకూలంగా రావడంతో జనసేన,టీడీపీ , బీజేపీ నేతలతోపాటు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ముక్యంగా షర్మిలకు ఎక్కడ కూడా హత్య కేసు గురించి నోరుమెదప కుండా అయ్యింది.
వివేకా నంద రెడ్డి హత్య కేసు ఎందుకు ఆలస్యం అవుతుందని ఇప్పటికే సుప్రీకోర్టు ప్రశ్నించింది.స్థానిక పోలీస్ యంత్రాంగం,సీబీఐ, రాజకీయ నేతలు కేసు విషయమై తీవ్ర ఒత్తిడికి గురయ్యారు.కేసు సజావుగా సాగేందుకు తెలంగాణ రాష్ట్రము హై కోర్ట్ కు కేసు బదిలీ అయ్యింది.హత్య కేసు గురించి ఎందుకు మాట్లాడరాదు. మాట్లాడకుండా ఉండటానికి కోర్ట్ జోక్యం సరికాదంటూ హై కోర్టులో పిటిషన్ వేశారు. హై కోర్ట్ కు వెళ్లిన వారిలో వివేకా నంద రెడ్డి కుమార్తె సునీత తోపాటు పులివెందులలో టిడిపి అభ్యర్తిగా పోటీచేస్తున్న బీటెక్ రవి ఉన్నారు. ఈ పిటిషన్ ను జస్టిస్ విజయ్ తోపాటు శేషసాయి విచారణ చేయాల్సి ఉంది.కేసును విచారించాల్సిన న్యాయమూర్తులే చివరి నిమిషంలో పక్కకు జరిగారు. న్యాయమూర్తి శేషసాయి కేసు విచారణ నుంచి పూర్తిగా తప్పుకున్నారు. ఇప్పుడు ఈ కేసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతోపాటు కడప జిల్లాలో కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యింది.