Vivek Ramaswamy : ట్రంప్ నకు మద్దతుగా వివేక్ రామస్వామి గళం

Vivek Ramaswamy – Trump
Vivek Ramaswamy : ట్రంప్ నకు మద్దతుగా ఇండో-అమెరికన్ నేత వివేక్ రామస్వామి గళం విప్పారు. తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి ఉద్దేశాలపై ఆయన సందేహాలు వ్యక్తం చేశారు. ట్రంప్ ను దోషిగా పేర్కొంటూ కోర్టు తీసుకున్న నిర్ణయం కచ్చితంగా బెడిసి కొడుతుందని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్టు చేశారు.
‘‘ప్రాసిక్యూటర్ ఓ రాజకీయ నాయకుడు. అతడు ట్రంప్ ను దెబ్బతీస్తానని వాగ్దానం చేశాడు. ఇక జడ్జి గారి కుమార్తె డెమొక్రాటిక్ పార్టీ ఆపరేటివ్. ఆమె తండ్రి అధ్యక్షతన గతంలో పార్టీ కోసం నిధులను సేకరించింది. దీనికి తోడు శిక్ష విధించే సమయంలో నిందితుడి నేరాంగీకారంతో పనిలేదని జ్యూరి పేర్కొంది. ఇవన్నీ బెడిసికొడతాయి’’ అని రామస్వామి తన పోస్టులో పేర్కొన్నారు.