Vivek Gaddam : భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్న గడ్డం వివేక్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. తనకు బీజేపీ అంత ప్రియారిటీ ఇవ్వడం లేదని కాంగ్రెస్ లోకి వెళ్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ లోకి చేరిన ఆయన తెలంగాణ చరిత్రలో ఒక కొత్త రికార్డు క్రియేట్ చేశారు. అత్యంత ఎక్కువ సార్లు ఎక్కువ పార్టీలు మారిన ఘనత ఆయన దక్కించుకున్నారు. గుడిసెల వెంకటస్వామి కొడుకుగా రాజకీయంలోకి అడుగుపెట్టిన గడ్డం వివేక్ గతంలో పెద్దపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత ఆయన వివిధ పదువుల చేపట్టారు. బీజేపీ ఫుల్ ఫామ్ లో కొనసాగుతున్న సమయంలో అందులో చేరారు.
ప్రస్తుతం తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఆయనకు పార్టీ ఏ నియోజకవర్గం సీటు ఇవ్వలేదు. గతంలో వివేక్ తో చర్చలు జరిపిన సమయంలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి అయినా.. లేదంటే తనకు బాగా పట్టు ఉన్న చెన్నూర్ నియోజకవర్గం టికెట్ కావాలని ఆయన కోరారు. దీంతో ఆయనకు పార్టీ హామీ ఇవ్వడంతో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. అయితే శుక్రవారం (నవంబర్ 10)తో నామినేషన్ గడువు కూడా ముగిసిపోయింది. అయినా ఆయన ఏ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేయనట్లు తెలుస్తోంది.
చెన్నూర్ కు సంబంధించి మొత్తం 23 మంది నామినేషన్ వేయగా.. అందులో గడ్డం వివేక్ పేరు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. జాబితా ప్రకటించడంలో మిస్టేక్ అయ్యిందా అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. వివేక్ కు చెన్నూర్ టికెట్ వస్తుందని ఆయన కొడుకు వంశీ భారీ బైక్ ర్యాలీ కూడా తీశారు. కానీ ఆయన గురించి వివరాలు లేకపోవడంతో నియోజకవర్గం వ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. అయితే గతంలో ఆయన ఎంపీగా విజయం సాధించారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న కాంగ్రెస్ పార్టీ లోక్ సభకు అవకాశం కల్పిస్తు్ందని వాదనలు వినిపిస్తున్నాయి.