JAISW News Telugu

Vishwak Sen : యాంకర్ చీరకట్టుకు విశ్వక్ సేన్ ఫిదా.. మనసు పారేసుకున్న యంగ్ హీరో.. వీడియో వైరల్..

FacebookXLinkedinWhatsapp
Vishwak Sen

Vishwak Sen

Vishwak Sen : యంగ్ హీరో విశ్వక్ సేన్ చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఫ్యాన్స్, ఫాలోవర్స్ ను విపరీతంగా పెంచుకున్నాడు. ప్రస్తుతం ఫుల్ క్రేజ్ లో ఉన్న హీరోల్లో ఆయన ముందుంటాడు. వివాదాలతో ఎక్కువ చెలిమి చేస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం ఆయన గ్యాంగ్ ఆఫ్ గోదావరి, గామి సినిమాలతో అభిమానుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే రీసెంట్ గా ఆయన ఒక యాంకర్ పై చేసిన కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు హ్యూజ్ వ్యూస్ ను దక్కించుకుంది.

యాంకర్ స్రవంతి గురించి కొంచెం తెలుసుకోవాలి. స్రవంతి ప్రశాంత్ తెలుగు టీవీ యాంకర్. ఆమె పుట్టింది, పెరిగింది హైదరాబాద్‌లోనే. గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన తర్వాత మోడలింగ్‌ నే కెరీర్‌ గా ఎంచుకుంది. మెల్ల మెల్లగా బుల్లితెరపైకి అడుగులు వేసింది. ఇందులో భాగంగా ఒక ప్రైవేట్‌ ఛానెల్‌లో యాంకర్‌గా మారింది. ఎక్స్‌ట్రా జబర్ధస్త్ షో ద్వారా ఆమెకు గుర్తింపు దక్కింది. ఆమెకు ప్రశాంత్‌తో వివాహం జరిగింది ఆమెకు ఎనిమిదేళ్ల కుమారుడు అఖిరా నందన్ ఉన్నాడు.

యాంకర్ స్రవంతిపై మనసు పారేసుకున్నాడు విశ్వక్ సేన్. ఈ వీడియోలో ‘చాలా బాగుంది’ అంటూ స్రవంతి ఏదో చెప్పబోయింది. అంతే అంతలో విశ్వక్ సేన్ అందుకొని ‘మీరు ఈ మధ్య హీరోయిన్స్ కన్నా మంచి చీరలు కడుతున్నారు’ అంటూ చెప్పాడు. దానికి ఆమె థాంక్స్ చెబుతూ నవ్వేసింది. ఈ వీడియో చూసిన వారంతా రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. నీ కన్ను ఆమెపై పడిందా? అంటూ భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు.

Exit mobile version