అయితే విష్ణు ప్రియకు బయట ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. బయట అనేక షోలు చేస్తూ వివిధ ఈవెంట్లలో పాల్గొంటూ అందరికీ సుపరిచితురాలు విష్ణు ప్రియ. అయితే ఈమె గేమ్స్ లలో ఎక్కువగా పాల్గొనడం లేదు. కేవలం ఎదుటివారిని విమర్శించడానికి మాత్రమే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఎదుటి వ్యక్తుల లోపాలని ఎత్తిచూపే విషయంలో ఎలా జాగ్రత్తగా ఉంటుందో అందరికీ తెలిసిందే. బిగ్బాస్ హౌస్లో టాస్కులు ఆడటం కూడా చాలా ఇంపార్టెంట్ .
దీంతో ఈ వారం విష్ణుప్రియకు ఓటింగ్ చాలా వరకు తగ్గిపోయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నిఖిల్ , నబిల్ ఓటింగ్లో టాప్ రేట్లో ఉండగా మిగతా నలుగురు కింది స్థాయిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నలుగురిలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయనేది తెలియడం లేదు. ప్రస్తుతానికైతే సరి సమానంగా ఓట్లు వస్తున్నట్లు సమాచారం.
అయితే ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది. కాబట్టి దాదాపు నైనిక ఎలిమినేట్ అవుతుందని అందరు భావిస్తున్నారు. కానీ విష్ణు ప్రియ కూడా డేంజర్ జోన్ లోనే ఉంది. ఐదో వారంలోనే ఆమెకు అభిమానులు ఓట్లు వేయకపోవడం అనేది షాకింగ్ విషయం. ఇంత పాపులారిటీ ఉన్న బుల్లితెర నటి అయిన విష్ణుకు ఓటింగ్ లో వెనక పడడం ఆశ్చర్యం కలిగించక మానదు. మరి మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఎవరు హౌస్ నుండి బయటకు వెళ్తారు అనేది అతి త్వరలోనే తేలిపోతుంది.