Vishnupriya Emotional : సినిమా రంగం అంటేనే గ్లామర్ ఫీల్డ్. ఇక్కడ ఎంత అందంగా ఉంటే అంత బాగా ఆదరిస్తారు. పైగా ఫిజిక్ లో కూడా చాలా బెటర్ గా ఉండాలి. ఏ మాత్రం తేడాగా ఉన్నా సరే ట్రోల్స్, నెగెటివ్ కామెంట్లు తప్పవు. కాగా చాలామంది ఈ నడుమ బాడీ షేమింగ్ ఎదుర్కుంటున్నారు. దాని వల్ల స్టార్ హీరోయిన్లు కూడా దీని బారిన పడి బాధపడాల్సి వస్తోంది.
ఇక తాను కూడా బాడీ షేమింగ్ బాధితురాలినే అంటూ కామెంట్ చేసింది విష్ణుప్రియ. ఆమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. తర్వాత హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించింది. కానీ హీరోయిన్ గా పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదు. కానీ ఆమె తన ప్రయత్నాలు ఆపట్లేదు.
కాగా తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆమె మాట్లాడుతూ.. నేను కూడా బాడీ షేమింగ్ ను ఎదుర్కున్నాను. నేను కొన్ని సార్లు జిమ్ లలో కష్టపడే వీడియోను షేర్ చేసేదాన్ని అవి చూసిన కొందరు నువ్వు ఏంటి పొట్ట అంతగా పెంచావ్.. కొంపదీసి పెండ్లికి ముందే ప్రెగ్నెంట్ అయ్యావా అంటూ కొందరు బాడీ షేమింగ్ కామెంట్లు చేశారు.
ఇండస్ట్రీలో కూడా నాకు ఇలాంటి ప్రశ్నలు చాలానే ఎదురయ్యాయి. నా బాడీ మీద చాలానే నెగెటివ్ కామెంట్లు విన్నాను. కానీ నేను వాటిని పెద్దగా పట్టించుకోను. నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. నా ట్యాలెంట్ ను చూసి అవకాశాలు ఇస్తారని ఆశిస్తున్నాను అంటూ కామెంట్లు చేసింది విష్ణుప్రియ. కాగా ఆమె ఇప్పుడు ప్రైవేట్ ఆల్బమ్స్ లో కూడా బాగానే నటిస్తోంది. ఏ ఛాన్స్ వచ్చినా సరే వదులుకోకుండా చేస్తోంది.