JAISW News Telugu

Vishnu Priya : ఇంటికి పట్టిన దరిద్రం పోయింది విష్ణు ప్రియ సంచలన వ్యాఖ్యలు

Vishnu Priya

Vishnu Priya and Sonia

Vishnu Priya Vs Sonia :  బిగ్ బాస్ హౌస్ ఎనిమిదో సీజన్లో రోజుకో ట్విస్ట్ జరుగుతోంది. సోనియా ని అందరూ తిట్టుకున్నారు. ఒక్క గేమ్ కూడా ఆడకుండా కేవలం నిఖిల్, పృథ్వీలను అడ్డుపెట్టుకొని బయటపడుతుందని అందరూ అనుకున్నారు. ఒక్కసారి  నామినేషన్లకు వస్తే సోనియాను ఎలిమినేట్ చేద్దామని రెడీ గా ఉన్నారు. అదే విధంగా సోనియా ఇలా నామినేషన్లలోకి రాగానే ఎలిమినేట్ చేసేసారు.

ఆమెకు ఓట్లు వేయకుండా ఆమెను హౌస్ నుంచి బయటకు పంపించేశారు. కాగా సోనియా గతంలో విష్ణు ప్రియ పై ఆమె కుటుంబ సభ్యులపై కామెంట్లు చేసింది. విష్ణు ప్రియ వేసుకునే బట్టల గురించి కూడా వల్గర్ గా మాట్లాడేది. వారి కుటుంబ సభ్యులు ఎలా ఉంటారో అర్థం చేసుకోవాలని కూడా వ్యాఖ్యానించింది. ఇలాంటి వ్యాఖ్యలతో సోనియా బయట ఉన్న ప్రజల్లో ఒక నెగెటివీటిని కూడగట్టుకుంది. దీంతో సోనియా పై చాలా మందికి అసహ్యం వేసింది. అయితే ప్రస్తుతం సోనియా ఇంటి నుంచి ఎలిమినేట్ అయిపోయింది.

అయినా కూడా ఆమె గురించి బిగ్ బాస్ హౌస్ లో చర్చ నడుస్తూనే ఉంది. విష్ణు ప్రియ కూడా తాను ఏం తక్కువ తినలేదు అన్నట్లుగా ప్రస్తుతం తన ప్రవర్తన తో చిరాకు పుట్టిస్తుంది. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయిన సోనియాను పట్టుకొని ఘోరమైన వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ హౌస్ కు పట్టిన దరిద్రం వదిలిపోయింది అని కామెంట్ చేసింది. అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతం పృథ్వి, నిఖిల్ మాట్లాడుతున్నారని ప్రేరణతో చెప్పింది.

విష్ణు ప్రియ, ప్రేరణ కలసి ఇద్దరు డైనింగ్ టేబుల్ వద్ద కూర్చున్న సమయంలో మాట్లాడుకుంటూ సోనియా ఉన్నప్పుడు కనీసం నిఖిల్ పృథ్విలు మన వైపు చూసే వారు కాదు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం మాట్లాడితే కూడా స్పందిస్తున్నారు అని అన్నారు. వెళ్ళిపోయే సమయంలో కూడా తన తప్పు తెలుసుకోకుండా మన మీదనే కామెంట్స్ చేస్తూ వెళ్లిపోయింది. ఆమెకు ఎంత పొగరు అంటూ ఇద్దరు చర్చించుకున్నారు. ఇది కాస్త టెలికాస్ట్ కావడంతో విష్ణు ప్రియ పై చాలామంది మండిపడుతున్నారు. మీకు సోనియాకు తేడా ఏమీ లేదు అని కామెంట్లు పెడుతున్నారు.

Exit mobile version