JAISW News Telugu

Minister Narayana : కేంద్రం అనుమతులు రాగానే విశాఖ మెట్రో రైలు పనులు: మంత్రి నారాయణ

Minister Narayana

Minister Narayana

Minister Narayana : కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల్లో విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుపై డీపీఆర్ ను సిద్ధం చేశామని, ఇప్పటికే దీన్ని కేంద్రానికి పంపినట్లు చెప్పారు. అక్కడి నుంచి అనుమతులు రాగానే పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.

ఈ మేరకు మంత్రి మాట్లాడుతూ మెట్రో రైలు ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా పక్కన పెట్టిందని ఆరోపించారు. ఈ ప్రాజెక్టుపై స్వయంగా కేంద్రమంత్రిని కలిసినట్లు వివరించారు. సీఎం చంద్రబాబు కూడా ప్రధాని మోదీకి లేఖ రాశారని చెప్పారు. విశాఖలో మొత్తం 76.90 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం చేపడతామన్నారు. రెండు ఫేజ్ లలో 4 కారిడార్లలో నిర్మిస్తామని మంత్రి నారాయణ వివరించారు.

Exit mobile version