International Drugs Mafia : అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా నెట్ వర్క్ లో విశాఖ.. దేశవ్యాప్తంగా అపఖ్యాతి
International Drugs Mafia : ప్రపంచ వ్యాప్తంగా డ్రగ్స్ వాడకం పెరిగిపోతోంది. దీనికి అంతర్జాతీయ మార్కెట్ ఉంది. ఈజీగా మనీ సంపాదనకు కొందరు డ్రగ్స్ మాఫియాలోకి దిగుతున్నారు. సినిమాల్లో, వెబ్ సిరీస్ ల్లో చూసే వాటికంటే ఎక్కువగా నిజజీవితంలో డ్రగ్స్ మాఫియా పెరిగిపోయింది. దీనిలో మన విశాఖ ఉండడం బాధాకరం. విశాఖ పోర్టులోకి ఏకంగా 25వేల కిలోల కొకైన్ రావడం అంటే చిన్న విషయం కాదు.. ఒక్క గ్రామ్ కొకైన్ పదిహేను వేలకు పైమాటే. అలాంటి పాతిక వేల కేజీలు వచ్చింది. అంటే ఎన్నివేల కోట్లో అంచనా వేయగలమా?
ఆ డ్రగ్స్ మొత్తాన్ని ఎక్కడ ప్రాసెస్ చేస్తారు..ఎవరికి అమ్ముతారు..ఎలా ట్రాన్స్ పోర్ట్ చేస్తారన్నది ఎవరికీ తెలియని ఓ నెట్ వర్క్ అత్యంత కీలకం. ఈ నెట్ వర్క్ ను ఆపరేట్ చేసే వాళ్లు ఏపీలోనే ఉన్నారని తాజాగా స్పష్టమైంది. డ్రగ్ డీలర్ల ఇంత పెద్ద మొత్తంలో ఓ చోటకు డ్రగ్స్ పంపరు. ఎంతో సేఫ్.. అనుకుని చిన్న మొత్తాల నుంచి పెంచుకుంటూ పోతారు. అంత సేఫ్ అనిపించేలా పోర్టు నుంచి ఎవరికీ దొరకకుండా దిగుమతులు చేసుకోవడం ద్వారానే ఇది సాధ్యం. ఇప్పుడు అదే జరిగింది. పెద్ద ఎత్తున ఈ పోర్టుకు బ్రెజిల్ నుంచి సరుకు దిగుమతి అవుతోంది. అంతర్జాతీయ ముఠా.. విశాఖలో క్యాంపు పెట్టుకుని మరీ.. డ్రగ్స్ వ్యవహారాలను నడుపుతోందన్నమాట.
సాధారణంగా అధికార వర్గాలు.. గట్టిగా ఉంటే గంజాయి మొక్క కూడా బయటకు పోకూడదు. కానీ రాష్ట్రాన్ని పాలిస్తున్న వారి వ్యవహారశైలిపై మొదటి నుంచి అనుమానాలున్నాయి. దేశంలో అన్ని రాష్ట్రాలు గంజాయి వ్యాప్తికి కారణంగా ఏపీని చూపించాయి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏకంగా వేల కిలోలు సరుకు బయటపడింది. ఇప్పుడు సీబీఐ, ఇతర కేంద్ర దర్యాప్తు విభాగాల అధికారులు అత్యవసరంగా.. ఈ డ్రగ్ రాకెట్ ను ఛేదించాల్సి ఉంది. ఎన్ని సార్లు తెప్పించారు. ఎక్కడ ప్రాసెస్ చేశారు.. ఎలా బయటకు వెళ్లాయి.. ఎవరు సహకరించారో తేలిస్తే కానీ దేశం డ్రగ్స్ మహమ్మారి గుప్పిట నుంచి బయట పడదు.