Russia : ఇక రష్యా వెళ్లాలంటే వీసా అవసరం లేదు..!
Russia : భారత్, రష్యా మిత్రదేశాలని ప్రపంచానికి మొత్తం తెలిసిందే. భారత్ కు ఏ ఆపద వచ్చినా రష్యా దాని ముందుంటుంది. ఇప్పటి వరకు భారత్ తో శత్రుత్వం ఉన్న దేశాలకు రష్యా వార్నింగ్ లు కూడా ఇచ్చింది. భారత్ కూడా రష్యా అంటే అభిమానిస్తుంది. అందుకే పెద్ద ఎత్తున బిజినెస్ చేస్తుంది. ఉక్రెయిన్ వార్ సమయంలో ప్రపంచంలోని కొన్ని దేశాలు రష్యాతో వాణిజ్యం చేయద్దని చెప్పినా భారత్ వినలేదు. ఆ సమయంలో అమెరికా ఆంక్షలు విధిస్తామన్నా భారత్ జనకలేదు. అంతటి మిత్రపక్ష దేశం రష్యా. అయితే ఇరు దేశాల మధ్య టూరిజం డెవలప్ మెంట్ రెండు ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. 2025 నుంచి ఇది అమల్లోకి రానుంది. భారత్ నుంచి పర్యాటలను ఆకర్షించేందుకు రష్యా చర్యలు తీసుకుంటుంది. 2024 ప్రథమార్థంలో, 28,500 మంది భారతీయ ప్రయాణికులు రష్యా రాజధానిని సందర్శించారు. ఇది గతేడాదితో పోలిస్తే 1.5 రెట్లు పెరిగింది. 2023లో 60 వేల మంది సందర్శకులతో భారత్ నాన్-సీఐఎస్ దేశాల్లో అగ్రస్థానంలో ఉంది, 2022 నుంచి 26 శాతం పెరుగుదల నమోదైంది. భారతీయ పౌరులు మాస్కోను సందర్శించడానికి ప్రధాన కారణాలు వ్యాపారం. ఇప్పుడు టూరిస్ట్ కూడా తోడైతే ఈ సంఖ్య పెరుగుతుందని రష్యా భావిస్తోంది.