Visa-free entry : వీసా రహిత ప్రవేశం గడువు రెండు నెలల పొడిగింపు.. థాయ్ లాండ్ భారీ ఆఫర్..
Visa-free entry : భారత్ తో వ్యాపార, వాణిజ్యం, టూరిజం లాభదాయకంగా ఉంటుందని ప్రపంచం మొత్తం భావిస్తోంది. అందుకే ఆయా దేశాలకు వీసా రహిత ప్రవేశం కల్పిస్తున్నాయి. భారతీయులకు వీసా రహిత ప్రవేశాన్ని తాము కల్పిస్తామని రష్యా మొన్న చెప్పుకచ్చింది. దీన్ని త్వరలో అమలు చేస్తామని చెప్పింది. దీంతో పాటు మరో దేశం వీసా రహిత ప్రవేశం గడువు ముగిసినా కూడా మరో రెండు నెలలు (60 రోజులు) పొడిగించింది. భారత్ తో టూరిజం లాభసాటిగా ఉందన్న సదరు దేశం భారత్ నుంచి వచ్చే సందర్శకులను ఆప్యాయంగా పలకరిస్తూ ఆతిథ్యం ఇస్తుంది. థాయ్‌లాండ్ భారతీయ పౌరులకు వీసా రహిత ప్రవేశ విధానాన్ని నిరవధికంగా పొడిగించింది. వాస్తవానికి నవంబర్ 11, 2024న దీని గడువు ముగుస్తుంది. ఈ విధానం ఇప్పుడు భారతీయ సందర్శకులు వీసా అవసరం లేకుండా 60 రోజుల వరకు థాయ్‌లాండ్‌లో ఉండేందుకు అనుమతిస్తుంది, స్థానిక ఇమ్మిగ్రేషన్ కార్యాలయంలో వారి బసను అదనంగా 30 రోజులు పొడిగించే అవకాశం ఉంది. దీంతో థాయ్ లాండ్ వెళ్లాలనుకునే వారు అక్కడ టూరిజం ఎంజాయ్ చేసే వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.