Zimbabwe Series : టీ 20 వరల్డ్ కప్ ముగియగానే రాబోయే జింబాబ్వే సిరీస్ కు టీం ఇండియా జట్టును మరో వారం రోజుల్లో సెలెక్ట్ చేయనున్నారు. అయితే టీం ఇండియా జింబాబ్వే జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కొహ్లిలను పక్కన పెట్టనున్నారు. విరాట్ కొహ్లి, రోహిత్ శర్మలు టీ 20 వరల్డ్ కప్ లో ఆడుతుండగా.. వచ్చే సిరీస్ లలో వారికి విశ్రాంతినిచ్చి.. ఐపీఎల్ లో బాగా రాణించిన వారిని తీసుకునే అవకాశం ఉంది.
చైనా లో జరిగిన ఆసియా క్రీడల్లో ద్వితీయ శ్రేణి జట్టు వెళ్లింది. అక్కడ రాణించిన జట్టు ఫైనల్లో గెలిచి బంగారు పతకాన్ని సాధించింది. ముఖ్యంగా రుతురాజ్ కెప్టెన్సీలో రింకూ సింగ్, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ ఇలా రాణించారు. అనంతరం జరిగిన ఐపీఎల్ లో అభిషేక్ శర్మ, మయంక్ యాదవ్, రింకూ సింగ్, సంజు శాంసన్ లాంటి అనేక మంది ప్లేయర్లు రాణించగా.. వారిని జింబాబ్వే టూర్ కు ఎంపిక చేయనున్నట్లు సమాచారం..
జింబాబ్వే సిరీస్ కు ముందుగా టీ 20 వరల్డ్ కప్ గెలవాలని బీసీసీఐ కోరుకుంటోంది. వరల్డ్ కప్ లో రాణిస్తే రెండో టీం ఎంపిక కూడా ఈజీగా అవుతుంది. సూర్య కుమార్ యాదవ్, హర్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, విరాట్ కొహ్లి, ఇలా చాలా మంది ఆటగాళ్లను జింబాబ్బే సిరీస్ కు పక్కన బెట్టి యువకులకు చాన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. రియాన్ పరాగ్ రూపంలో స్పిన్ బ్యాట్ ఆల్ రౌండర్ ను కూడా సెలెక్ట్ చేయనున్నట్లు సమాచారం.
జింబాబ్వే వెళ్లే టీంలో అభిషేక్ శర్మ, మయంక్ యాదవ్, రియాన్ పరాగ్, అశుతోష్ శర్మ ఇలా అనేక మంది యంగ్ స్టార్లు వెయిట్ చేస్తున్నారు. బీసీసీఐ ఆగ్రహానికి గురైన ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ లను పరిగణలోకి తీసుకుంటారో లేదో చూడాలి. శ్రేయస్ అయ్యర్ టీంలోకి వస్తే పెను సంచలనమే.