Virat Kohli : షమీకి మద్దతుగా నిలిచిన విరాట్ కొహ్లి.. అలాంటి వ్యాఖ్యలు సరైనవి కావు

Virat Kohli

Virat Kohli

Virat Kohli : విరాట్ కొహ్లి, మహమ్మద్ షమీకి మద్దతుగా నిలిచాడు. చాలా మంది సోషల్ మీడియాలో షమీ రిలిజన్ పై కామెంట్లు చేస్తుండడంతో  కావాలనే ఇలా చేస్తున్నారని మండిపడ్డాడు. సోషల్ మీడియాలో కానీ, ఎక్కడైనా కానీ ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది. కానీ తమ అభిప్రాయాలతో ఇతరుల ను హింసించే ప్రతి ఒక్కరికీ నేను వ్యతిరేకమని కొహ్లి అన్నాడు.

అలాంటి వారి గురించి ఒక్క క్షణం కూడా నేను నా జీవితంలో వెస్ట్ చేయలేను. ఎందుకంటే వారి గురించి ఆలోచించి సమయం వేస్ట్ చేయదల్చుకోలేదు. షమీ ఇండియా క్రికెట్ కు ఎంతో సేవలు చేశాడు. ఒక్క మ్యాచ్ ఓడిపోగానే అతడిపై కావాలనే నిందలు వేయాలనుకోవడం పొరపాటు.

ముందుగా మనందరం మనుషులం. మానవత్వంలో ఆలోచించడం నేర్చుకోవాలి. ఇతరుల మీద, వారి రిలీజన్ పై దూషణలు చేయడం అనేది సరైంది కాదు. షమీకి 200 శాతం నా మద్దతు ఉంటుంది. అతడు తిరిగి మళ్లీ టీం ఇండియాకు ఆడటంలో ఆల్ వేస్ సహకరిస్తుంటానని కొహ్లి చెప్పాడు.

షమీ వరల్డ్ కప్ లో అద్బుతంగా రాణించాడు. టీం ఇండియా వరల్డ్ కప్ లో ఫైనల్ చేరడంతో షమీ బౌలింగ్ ప్రధాన కారణంగా చెప్పొచ్చు. అలాంటి షమీపై కొంతమంది ఆకతాయిలు సోషల్ మీడియా వేదికగా అప్పుడప్పుడూ దూషణలకు దిగుతుంటారు. అతడి ఆ రిలీజన్ కావడం వల్లే కావాలనే టీం ఇండియా ఓడిపోయేలా చేశాడని దారుణమైన కామెంట్లు చేశారు. దీనికి గతంలో ఇండియా టీం మొత్తం షమీకి మద్దతు గా నిలిచింది.  షమీ ఇండియా క్రికెట్ కోసం ఎంతో పని చేశాడు. ఇంకా ఆడతాడు తన సేవలను అందిస్తాడు. ఎవరో ఏమో అన్నారని పట్టించుకోనవసరం లేదు. ఎందుకంటే టీం ఇండియాలో షమీ నెంబర్ వన్ ఫేస్ బౌలర్. కాబట్టి షమీకి తమ పూర్తి మద్దతు ఉంటుందని విరాట్ కొహ్లి ఒక ఇంటర్వ్యూలో తన మద్దతు తెలియజేశాడు.

TAGS