JAISW News Telugu

Virat Kohli : ద్రవిడ్ రికార్డును బద్దలు కొట్టబోతున్న విరాట్  కోహ్లీ.. సచిన్ ను అధిగమించడం సాధ్యమేనా?  

Virat Kohli

Virat Kohli

Virat Kohli : భారత్- న్యూజిలాండ్ మధ్య మూడో టెస్టుకు సన్నాహాలు  ప్రారంభమయ్యాయి. నవంబర్ 1 నుంచి ముంబైలోని వాంఖడే స్టేడియంలో చివరి మ్యాచ్ జరగనుంది. కాగా, ఈ  మ్యాచ్‌లో అందరి చూపు విరాట్ కోహ్లీపైనే  ఉండనుంది. ఈ సిరీస్‌లోని రెండు టెస్టుల్లో ఒక్క ఇన్నింగ్స్‌లోనూ విరాట్ కోహ్లీ ఫెయిలయ్యాడు. కోహ్లీ ఆటతీరును చూడాలని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో కోహ్లీ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన మరుక్షణమే రాహుల్ ద్రవిడ్ రికార్డును బద్దలు కొట్టనున్నాడు. సచిన్ టెండూల్కర్ తర్వాత స్థానంలో విరాట్ నిలవనున్నాడు.

600 ఇన్నింగ్స్ ఆడనున్న కోహ్లీ..

విరాట్ కోహ్లీ తన 600వ అంతర్జాతీయ ఇన్నింగ్స్ ఆడేందుకు ఒక్క కేవలం అడుగు దూరంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తం 599 ఇన్నింగ్స్‌ ఆడాడు. 600 ఇన్నింగ్స్‌లు పూర్తి చేయడానికి మరో మ్యాచ్ మాత్రమే అవసరం. నవంబర్ 1 నుంచి ముంబైలో ప్రారంభమయ్యే టెస్టులో కోహ్లి మైదానంలోకి రాగానే, భారత్ నుంచి ఈ ఘనత సాధించిన రెండో బ్యాట్స్‌మెన్‌గా రికార్డులకెక్కనున్నాడు. రాహుల్ ద్రవిడ్ తన అంతర్జాతీయ కెరీర్‌లో 599 ఇన్నింగ్స్‌ మాత్రమే ఆడాడు. తన 600వ ఇన్నింగ్స్‌ను ఆడలేకపోయినా, కానీ మరో కోణంలో చూస్తే అతను ద్రావిడ్ అంతర్జాతీయ క్రికెట్‌లో 600 కంటే ఎక్కువ ఇన్నింగ్స్‌ ఆడాడు. రాహుల్ ద్రవిడ్ మొత్తం 605 ఇన్నింగ్స్‌ ఆడాడు. అయితే అవన్నీ ఇండియా తరపున మాత్రం కాదు. ఆసియా 11 కోసం కొన్ని మ్యాచ్‌లు కూడా ఆడాడు.  దీంతో ద్రవిడ్ మొత్తం అంతర్జాతీయ ఇన్నింగ్స్‌ల 600 కంటే ఎక్కువ, కానీ టీమిండియా తరపుణ ఆడినవి 599 ఇన్నింగ్స్‌ల మాత్రమే.  అయితే ఇందులోనూ రాహుల్ ద్రవిడ్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టే దిశలో ఉన్నాడు. అయితే ఈ రికార్డు తొలిరోజు టెస్టులోనే బ్రేక్ అవుతుందా? ఆ తర్వాతా అనేది ఆసక్తికరంగా మారింది.

సచిన్ ను అధిగమించడం కష్టమే..

టెస్టు్ల్లో అత్యధిక ఇన్నింగ్స్ ఆడిన క్రికెటర్ గా సచిన్ టెండూల్కర్ నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. భారత్ తరఫున అత్యధిక అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లు ఆడిన బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్. టీమిండియా తరఫున సచిన్ మొత్తం 782 ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ విషయంలో ఇప్పటికీ సచినే నెంబర్ వన్. రాహుల్ ద్రావిడ్‌ని విరాట్ కోహ్లీ అధిగమిస్తాడనంలో ఎలాంటి సందేహం లేదు. కానీ సచిన్ టెండూల్కర్‌ను విరాట్ అధిగమించడం అనేది సాధ్యమయ్యేలా కనిపిచండం లేదు. ఇదిలా ఉంటే, రికార్డుతో పాటు, తదుపరి మ్యాచ్‌లో కోహ్లి బ్యాటింగ్ లో రాణిస్తాడా లేడా అనే దానిపైనే అందరి దృష్టి ఉంది. మరి దీపావళి తర్వాత కోహ్లీ తన బ్యాట్ తో మోత మోగిస్తాడో లేదో చూడాల్సిందే.

Exit mobile version