Virat Kohli : టీ-20 వరల్డ్ కప్ నుంచి కోహ్లీ అవుట్? బీసీసీఐ చెప్తున్న సిల్లీ రీజన్ ఇదే..

Virat Kohli

Virat Kohli

Virat Kohli : క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న టీ-20 వరల్డ్ కప్ మరో మూడు నెలల్లో ప్రారంభం కానుంది. వన్డే ప్రపంచకప్ 2023లో ఫైనల్ లో ఓడిన భారత్..టీ 20 కప్ ను ఎలాగైనా కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఈ మెగా టోర్నీ కోసం జట్టును సిద్ధం చేసే పనిలో బీసీసీఐ ఇప్పటి నుంచే ప్రారంభించింది. కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్, సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్ లతో కలిసి పొట్టి కప్ కోసం రోడ్ మ్యాప్ ను రూపొందించారు. ఈ ఏడాది జూన్ 2 నుంచి 29 వరకూ అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరిగే ఈ వరల్డ్ కప్ జరుగనుంది.

అయితే ఈ టోర్నీలో పరుగుల రారాజు, రన్ మిషన్ విరాట్ కోహ్లీ అడుతాడా? లేదా? అనే సందేహం కలుగుతోంది. వాస్తవానికి టీ-20 వరల్డ్ కప్ 2022 తర్వాత సెమిస్ లో భారత్ ఓడిపోయిన తర్వాత కోహ్లీ మళ్లీ మరో మ్యాచ్ ఆడలేదు. పలు కారణాల వల్ల కోహ్లీని ఈ టోర్నీ నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. వెస్టిండీస్ స్లో వికెట్ పిచ్ లు విరాట్ కోహ్లీకి సూట్ కావని బీసీసీఐ భావిస్తోందని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విషయంలో కోహ్లీని ఒప్పించే బాధ్యతలను అజిత్ అగార్కర్ తీసుకోనున్నట్లు సమాచారం. ఆ ప్లేస్ లో యువ ఆటగాడిని తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే పొట్టి వరల్డ్ కప్ లో కోహ్లీని ఆడించరు అనే వార్తలపై ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. పిచ్ ల పేరుతో సీనియర్ ఆటగాడిని ఎలా పక్కనపెడుతారని అంటున్నారు. కోహ్లీ ఆడకుంటే తాము క్రికెట్ చూడమని, రిప్ బీసీసీఐ అని కామెంట్స్ చేస్తున్నారు. కోహ్లీ చూడని పిచ్ లా? అంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కోహ్లీని పక్కనపెట్టాలని చూస్తే దేశంలోని కోట్లాది ఫ్యాన్స్ ఆ వరల్డ్ కప్ చూడరని హెచ్చరిస్తున్నారు.

TAGS