Virat Kohli : రాజ్‌కోట్, రాంచీ వేదికగా ఇంగ్లాండ్ తో జరగనున్న మూడు, నాలుగో టెస్టులకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరం కానున్నాడని ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో తెలిపింది. 5 మ్యాచ్ ల సిరీస్ లో తొలి 2 టెస్టులకు వ్యక్తి గత కారణాలతో విరాట్ దూరమవుతున్నాడు. ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్‌లో మూడో టెస్ట్, 23న రాంచీలో చివరి టెస్ట్ ప్రారంభం కానున్నాయి.
ఫిబ్రవరి 15 నుంచి రాజ్ కోట్‌లోని సౌరాష్ట్ర స్టేడియంలో మూడో టెస్ట్, 23 నుంచి రాంచీలోని జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్‌లో చివరి టెస్ట్ జరగనుంది. మార్చి 6 నుంచి ధర్మశాలలో ప్రారంభమయ్యే ఐదో టెస్టుకు కోహ్లీ అందుబాటులో ఉండడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మిగిలిన మూడు టెస్టులకు సెలక్టర్లు ఈ వారంలో జట్టును ప్రకటించే అవకాశం ఉంది.
సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ లేదా బీసీసీఐ ఉన్నతాధికారులు ఆయనతో మాట్లాడి స్పష్టత ఇస్తారని తెలుస్తోంది.
అయితే గాయాల కారణంగా వైజాగ్ లో జరిగిన రెండో టెస్టుకు దూరమైన భారత ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా మూడో టెస్టుకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.. కోహ్లీ టెస్టులకు దూరం కావడానికి వ్యక్తిగత కారణం తన రెండో బిడ్డ రాక. తన క్లోజ్ ఫ్రెండ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ మాజీ సహచరుడు ఏబీ డివిలియర్స్ తన యూట్యూబ్ ఛానెల్ లో కొన్ని వివరాలు తెలిపాడు.
విరామం ద్వారా కోహ్లీ సరైన పని చేశాడని డివిలియర్స్ అన్నాడు. ‘అవును, అతని రెండో బిడ్డ వస్తున్నాడు. ఇది కుటుంబ సమయం, విషయాలు అతనికి ముఖ్యమైనవి. మీరు మీకు సత్యం, నిజాయితీ లేకపోతే, మీరు ఇక్కడ దేని కోసం వచ్చారో మీరు ట్రాక్ కోల్పోతారు. చాలా మంది ప్రాధాన్యత కుటుంబం అని నేను అనుకుంటున్నాను. అందుకు విరాట్ ను జడ్జ్ చేయలేం. అవును, మేము అతన్ని మిస్ అవుతున్నాము. కానీ అతను సరైన నిర్ణయం తీసుకున్నాడు’ అని డివిలియర్స్ అన్నాడు.