Virat Kohli : విరాట్ బ్రో అంత మాటన్నవేంటీ.. నిన్ను చూడకుండా ఉండాలంటే మా గుండెలు పగిలిపోతాయ్
Virat Kohli : విరాట్ కొహ్లి సంచనల విషయం బయటపెట్టాడు. క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత మీకు అస్సలు కనిపించను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో క్రికెట్ అభిమానులతో పాటు విరాట్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. విరాట్ కొహ్లి ది ఇండియా క్రికెట్ లో వేరే లెవల్. సచిన్ తర్వాత ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేస్తారనే ఆందోళనలో ఉన్న భారత క్రికెట్ కు దొరికిన వజ్రాయుధం విరాట్.
ఒక్కోసారి సచిన్ రికార్డులన్నింటిని విరాటే బద్దలు కొడతాడనేలా క్రికెట్ లో రాణించాడు. ప్రపంచంలోని అన్ని జట్లపై దూకుడుగా ఆడుతూ.. మాటలతోనే కాదు బ్యాట్ తో కూడా సమాధానం చెప్పాడు. సచిన్ క్రియేట్ చేసిన చాలా రికార్డులను తుడిచిపెట్టేశాడు. వన్డేల్లో కూడా సచిన్ సెంచరీల రికార్డును బ్రేక్ చేశాడు. రికీ పాంటింగ్, కలిస్ లాంటి అగ్రశ్రేణి బ్యాటర్ల రికార్డులను బద్దలు కొట్టాడు.
అలాంటి విరాట్ క్రికెట్ ఆడేంతవరకు మాత్రమే మీరు నన్ను చూస్తారు. ఆ తర్వాత నేను మీకు కనిపించను అని ప్రకటించాడు. క్రికెట్ లో ఫిట్ నెస్ ముఖ్యం. ఫిట్ నెస్ ఉంటేనే ఏదైనా సాధ్యమని నమ్మే విరాట్ నాన్ వెజ్ మానేసి పూర్తిగా ఫిట్ నెస్ సాధించి యువ క్రికెటర్లకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. నట్స్, డ్రైప్రూట్స్, కొవ్వు లేని పదార్థాలు తింటూ చాలా యాక్టివ్ గా ఉంటాడు.
విరాట్ కొహ్లి టీ 20 వరల్డ్ కప్ కు సెలెక్ట్ అయ్యాడు. ఒక వేళ టీ20 వరల్డ్ కప్ గెలిస్తే విరాట్ కూడా ఏమైనా రిటైర్మెంట్ ఇస్తాడేమాననే టాక్ వినిపిస్తోంది. విరాట్ 2011 వన్డే వరల్డ్ కప్ లో సభ్యుడు. 2015 లో సెమీఫైనల్, 2019 లో సెమీఫైనల్, 2023 లో ఫైనలో వరల్డ్ కప్ జట్టులో విరాట్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. తను గొప్పగా ఏదీ సాధించకపోయినా దాని గురించి బాధపడుతూ కూర్చొనని.. తర్వాత జరగబోయే మ్యాచుల్లో తన ప్రదర్శన బాగుండటపైనే దృష్టి సారిస్తానని చెప్పాడు.