Viral Video : ఏపీలో ఎన్నికలు ప్రచారం నేటితో ముగియనుంది. పార్టీల అధినేతలు, అభ్యర్థులు ప్రచారంలో చివరి రోజు కావడంతో బిజీబిజీగా ఉన్నారు. రోడ్ షోలు, బహిరంగ సభలతో ఒక్క క్షణం కూడా తీరికగా ఉండడం లేదు. అలాగే అధినేతల తరుఫున కుటుంబ సభ్యులందరూ జనాల్లోకి వెళ్తున్నారు. ఇలా ఏపీలో ఎటు చూసినా ఎన్నికల సందడే కనిపిస్తోంది. ప్రజల్లో ప్రత్యక్షంగా ప్రచారం చేయడంతో పాటు సోషల్ మీడియా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పడం కన్నా ప్రత్యర్థులపై దుమ్మెత్తిపోయడం, వారిని ఇరుకున పెట్టే వీడియోలు, మీమ్స్, ఆర్టికల్స్ నే క్రియేట్ చేస్తున్నారు.
తాజాగా ఓ షార్ట్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. జగన్ పాలన రాష్ట్రాన్ని ఏవిధంగా కుదేలు చేసిందో సీరియస్ ఇష్యూను టచ్ చేస్తూనే జగన్ క్యారెక్టర్ విచిత్ర హావాభావాలు, సైకోయిక్ నవ్వు జనాలను తెగ కడుపుబ్బా నవ్విస్తుంది. ఇంతకీ వీడియోలో ఏముందంటే..
ఓ యువకుడు తన తండ్రి ఉద్యోగం పోయిందని జగన్ క్యారెక్టర్ దగ్గరకు వస్తాడు. అన్నా మా నాన్న ఉద్యోగం పోయిందని అతడు బాధతో చెప్తుంటే జగన్ వెర్రిగా నవ్వుతుంటాడు. ఎందన్నా అతడి తండ్రి ఉద్యోగం పోయిందంటే అలా నవ్వుతున్నావ్ ఏందన్నా అంటూ జగన్ ను అతడి అనుచరుడు అడుగుతాడు. దానికి జగన్ ఆ జాబ్ తీసేసింది మనమేరా..అని మళ్లీ నవ్వుతాడు. ఎందుకు తీయించావ్ అన్నా అంటే..‘‘ఆ జాబ్ ను చంద్రబాబు ఇచ్చాడురా..ఇస్తే మనమివ్వాలి..అది జరగదు..అందుకే చంద్రబాబు ఇచ్చిన ఉద్యోగాన్ని పీకేశా..’’ అంటాడు.
ఇంకా జగన్ క్యారెక్టర్ మాట్లాడుతూ..‘‘చంద్రబాబు రాజధాని పెట్టాడు..మనం లేకుండా తీసేశాం. బిల్డిండ్ లు కట్టాడు..కూల్చేశాం.. అలాంటిది జాబ్ ఎందుకు ఉంచుతాం..తీసేశాం’’ అంటూ మళ్లీ నవ్వుతుంటాడు. దానికి అనుచరుడు అన్నా నువ్వు నిజంగా సైకోవే అంటాడు..దానికి జగన్ క్యారెక్టర్ సైకో కాదురా సైకోకు మనమే బ్రాండ్ అంటాడు..దానికి అనుచరుడు ఆ బ్రాండ్ ను నువ్వే తాగాలి అంటూ సెటైర్ వేస్తాడు. ఇవన్నీ చూసి బిత్తరపోయిన ఆ యువకుడు స్పైడర్ విలన్ మీకు ఏమన్నా రిలేషనా అంటాడు జగన్ క్యారెక్టర్ తో. ఇక అఖర్లో ఆ యువకుడు ‘అతను కాదు పిచ్చోడు..ఆ పిచ్చోడికి ఓటేసిన మీరు పిచ్చోళ్లు’’ అంటూ వెళ్లిపోతాడు.
ఇలా కడుపుబ్బా నవ్వించేలా ఆ షార్ట్ వీడియో సాగుతుంది. నవ్వించడమే కాదు జగన్ అరాచక పాలనపై సెటైర్స్ మాములుగా లేవు. ఈ వీడియోను చూసిన ప్రతీ ఒక్కరు జగన్ కు ఓటు వేయరు గాక వేయరు.