KCR Viral Video : అదాని కంపెనీలపై కేసీఆర్ కామెంట్స్ వైరల్ వీడియో..
KCR Viral Video : కుబేరుల జాబితా తీసుకుంటే ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చారు అదాని. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానిని వెనక్కు నెట్టిన అదాని 6.5 బిలియన్ డాలర్లతో ఇండియాలో నెం. 1, ఆసియాలో టాప్ 5లో చేరారు. ఇటీవల హిండెన్ బర్గ్ కేసుపై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పు అదానికి అనుకూలంగా రావడంతో ఒక్క రోజే ఆయన షేర్లు విపరీతంగా అమ్ముడు పోయాయి. దీంతో షేర్ మార్కెట్లో ఆయన విలువ విపరీతంగా పెరిగింది.
ఇదంతా పక్కన పెడితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. అదాని కంపెనీలు హైదరాబాద్ కు వస్తానంటే తాను వద్దన్నానని కేసీఆర్ చెప్పారు. ఆ సమయంలో అదాని గ్రూప్ తీవ్రంగా మనీ మాయాజాలం చేస్తుందన్న వార్తలు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో అదాని గురించి మాట్లాడిన కేసీఆర్ ఆయన హైదరాబాద్ కు రావడాన్ని పూర్తిగా వ్యతిరేకించినట్లు చెప్పారు.
అదానికి చెందిన కంపెనీలు ఇప్పుడు హైదరాబాద్ కు వస్తున్నాయి. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కంపెనీ ప్రతినిధులతో ఇటీవల మాట్లాడారు. హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టాలని అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
కేసీఆర్ ఆ సమయంలో అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు సరైనవేనని అప్పుడు అదానిపై కేసు నమోదవడంతో ఈ వ్యాఖ్యలు చేశారని.. ఆ కేసులో అదాని నిర్ధోషి అంటూ సుప్రీం తీర్పు ఇచ్చింది. ఇక్కడ కంపెనీలు పెడితే ఇక్కడి యువతకు ఉపాధి దొరుకుతుంది. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి అదానికి కంపెనీలు పెట్టుకోవాలని కోరడం సరైనదే అని కామెంట్లు వస్తున్నాయి.