Viral Video Congress : ఈ వీడియో ఏంట్రా బాబు.. ఎడిటింగ్ ఎవడు చేశాడో కానీ మహానుభావుడు.. వీడియో వైరల్..

Viral Video Congress Campaign
Viral Video Congress Campaign RRR Version: చేతిలో సెల్ ఫోన్ బుర్రలో ఆలోచనలు ఇంకేముంది ఇక వీరిని ఆపడం ఎవరి వల్లా కాదేమో. తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి వివిధ పార్టీలు ప్రత్యర్థి పార్టీలపై విపరీతమైన మీమ్స్, మీమ్స్ వీడియోలు చేస్తూ వాటిని షేర్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు. సెల్ ఫోన్ లో వస్తున్న యాప్స్ తో డిజైన్ ఇట్టే అయిపోతుంది. కాసేపు సేద తీరే సమయం ఉంటే చాలు ఒక వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫారంపై పడ్డట్లే.
కర్ణాటక ఎన్నికలో గెలుపు నుంచి కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తుందని సర్వేలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుల మేనిఫెస్టో కూడా ఆకట్టుకుంది. కేసీఆర్ పథకాలను కొంచెం కాపీ కొట్టినట్లు అనిపించినా ఫలితాలను మాత్రం డబుల్ చేశారు. దీంతో కాంగ్రెస్ వైపు మొగ్గు పెరుగుతుందని రోజు రోజుకు సర్వేలు చెప్తున్నాయి. సర్వే ఫలితాలు ఎలా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ప్రభుత్వ వ్యవతిరేకతపై వీడియోలు, ఫొటోలు, పోస్టులు వైరల్ అవుతూనే ఉన్నాయి.
టాలీవుడ్ కు ఆస్కార్ తెచ్చిన రాజమౌళి సినిమా ‘ఆర్ఆర్ఆర్’తో కాంగ్రెస్ పార్టీ అభిమానులు చేసిన ఒక వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. దీన్ని ఎవరు తయారు చేశారో కానీ మహానుభావుడు అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. దొర (బ్రిటీష్ అధికారులు, కేసీఆర్), దొర గడిలో చిక్కుకున్న తెలంగాణ (చిన్నారి), తెలంగాణకు విముక్తి కల్పించేందుకు వచ్చిన రాహుల్ గాంధీ (ఎన్టీఆర్). పథకాలుగా జంతువులు ఈ వీడియో చూస్తే మతి పోవాల్సిందే. ఓ లుక్కేయండి మరి.