JAISW News Telugu

Viral Video: అబ్బురపడే అరుదైన వీడియో..బ్రహ్మపుత్ర నదిలో ఏనుగుల గుంపు ఎలా ఈదుకుంటూ వెళ్తుందో చూడండి..

Viral Video

Viral Video

Viral Video : ఉధృతంగా ప్రవహించే నదిలో ఏనుగుల గుంపు ఓ ప్రదేశం నుంచి మరోచోటుకు వెళ్లేందుకు ఈత కొట్టిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఏనుగులు కూడా గొప్పగా ఈదగలవని తెలుపుతూ ఓ ఐఎఫ్ఎస్ అధికారి కొన్ని ఫొటోలను ట్విటర్లో షేర్ చేశారు. అస్సాంలోని ఒక ఫొటోగ్రాఫర్ ఏనుగుల గుంపు వీడియోను చిత్రీకరించారు. అస్సాంలోని ప్రధాన నదీ నౌకాశ్రయాలలో ఒకటైన నిమతి ఘాట్ వద్ద చిత్రీకరించిన ఈ డ్రోన్ ఫుటేజీలో ఏనుగుల గుంపు బ్రహ్మపుత్ర నది దాటడం కనిపిస్తుంది. మీరు ఆ వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు.!

ఏనుగులు ఎల్లప్పుడూ భూమిపై నివసించే గంభీరమైన జీవులుగా కనిపించినప్పటికీ, ఈ వీడియో వాటి ఈత నైపుణ్యాలను స్పష్టంగా చూపిస్తుంది. సచిన్ భరాలీ అనే ఫొటోగ్రాఫర్ బంధించిన ఈ వీడియోలో ఏనుగులు నీటిలో ఈదుతూ కనిపించాయి. వాటి శరీరం పైభాగం మాత్రమే నీటిలో నుంచి బయటకు కనిపిస్తుంది. సచిన్ భరాలీ తీసిన ఈ వీడియో ఏనుగుకు ఉండే ఈత టాలెంట్‌ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. భారీ శరీరంతో కనిపించే గజరాజులు మనం ఊహించిన దానికంటే చాలా ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంటాయని ఈ వీడియో నిరూపిస్తుంది. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసి అందరూ మంత్రముగ్ధులయ్యారు.

ఏనుగులు నీటిలో ఈదలేవు అన్న అనుమానాన్ని ఇది విచ్ఛిన్నం చేస్తుంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు కూడా అద్భుతమైన దృశ్యంపై కామెంట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో వేగంగా వైరల్‌గా మారింది. ఇది ఇప్పటివరకు 50 లక్షలకు పైగా వీక్షించారు. సోషల్ మీడియా యూజర్లు ఈ వీడియో చూసి ఆశ్చర్యపోవడం, ప్రశంసిస్తున్నారు.

Exit mobile version