Viral News : పురాతన తవ్వకాల్లో నిధులు, నిక్షేపాలు బయట పడిన సంఘటనలు చాలా చూశాం. అలాంటిది ఏకంగా తవ్వకాల్లో ఏకంగా మొఘల్ కాలం నాటి బంగారు, వెండి నాణేల నిధి దొరికింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్ జిల్లాలోని జున్ వై ప్రాంతంలోని హరగోవింద్ పూర్ గ్రామంలో ఈ నిజం వెలుగు చూసింది. గ్రామం కోసం రోడ్డు పోసే క్రమంలో తవ్వకాలు జరుపుతుండగా నిధులు దొరకడంతో ఆ విషయం కాస్త ఆ నోట ఈనోట అందరికి తెలిసింది.
వారి గ్రామానికి రోడ్డు నిర్మించేందుకు తవ్వకాలు జరుపుతుండగా నిధులు ఉన్న కుండ దొరికింి. లాహ్రా నాగ్లా శ్యామ్ ప్రాంతానికి చెందిన మణిరామ్ సింగ్ కు చెందిన పొలం నుంచి తెప్పిస్తున్నారు. మట్టి తవ్వుతుండగా అకస్మాత్తుగా ఓ కుండ బయటపడింది. దాన్ని ఓపెన్ చేయగా కళ్లు చెదిరే సీన్. బంగారు, వెండి నాణేలు కనిపించాయి. దీంతో కాంట్రాక్టర్ స్థానికులు, కార్మికులకు కొన్ని నాణేలు ఇచ్చి పరారయ్యాడు. విషయం గ్రామంలో వ్యాపించగా అందరు అక్కడకు చేరుకున్నారు.
సమాచారం అందుకున్న అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. కాంట్రాక్టర్ పై కేసు నమోదు చేసుకుని గాలిస్తున్నారు. నాణేలు పరిశీలించిన అధికారులు అవి 18వ శతాబ్దానికి చెందినవని గుర్తించారు. దొరికిన నాణేలు కిలోకు పైగా ఉండొచ్చని భావిస్తున్నారు. మొత్తానికి నిందితులు దొరికితే నిధి గురించి మరిన్ని నిజాలు బయటపడే అవకాశాలున్నాయి.
గుప్త నిధులు దొరకడంతో విషయం వేగంగా వ్యాపించింది. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడారు. బంగారు, వెండి ఆభరణాల విలువ కోట్లలో ఉండటంతో నిందితుల గుర్తింపు కోసం వేగంగా గాలిస్తున్నారు. విచారణ ముమ్మరంగా చేస్తున్నారు. వారు పట్టుబడితే మరిన్ని నిజాలు తెలిసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. వారిని పట్టుకునేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు.