Viral News: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అహర్నిశలు కష్టపడుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చేందుకు శ్రమిస్తున్నారు. తాను పరుగులు పెట్టడంతో పాటు ఎమ్మెల్యేలను, మంత్రులను కూడా పరుగులు పెట్టిస్తున్నారు. అలాగే తప్పు చేసిన నాయకుల పట్ల కూడా సీఎం సీరియస్‌గా వ్యవహరిస్తున్నారు. స్వంత పార్టీ నేతలను కూడా క్రమశిక్షణలో ఉండాలని.. ఎలాంటి తప్పు చేయకూడదని గట్టిగా చెబుతున్నారు. ప్రజలకు సేవ చేయడమే తమ ప్రథమ కర్తవ్యం అని నేతలకు నిర్దేశిస్తున్నారు. తప్పు చేస్తే ఎవరైనా సరే చర్యలు తప్పవని హెచ్చరించారు కూడా. తాజాగా ఓ మంత్రికి కూడా గట్టిగా క్లాస్ తీసుకున్నారు సీఎం. ఇంతకీ ఎవరా మంత్రి.. తెలుసుకుందాం.
సీఎం చంద్రబాబు.. మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు క్లాస్ తీసుకున్నారు. టీడీపీ సభ్యత్వ నమోదుకు సంబంధించి మంత్రికి సీఎం వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సభ్యత్వ నమోదులో వెనుకబడి ఉన్నారని.. వేరే రాష్ట్రం నుంచి వచ్చినా ఎమ్మెల్యేను, మంత్రిని చేశానని.. రాజకీయాలపై సీరియస్‌నెస్ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా మిమ్మల్ని మీరు నిరూపించుకోకపోతే ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి వస్తుందంటూ మినిస్టర్‌కు ముఖ్యమంత్రి వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఆడియో వైరల్ అవుతోంది. ఆడియోలో.. ఫస్ట్ టైం ఎమ్మెల్యేవి, ఫస్ట్ టైం మంత్రివి సభ్యత్వ నమోదులో ఎక్కడున్నావో చూసుకున్నావా. 29శాతం శాతం మాత్రమే సభ్యత్వం నమోదైంది. 9000 గాను 2630 మాత్రమే చేశారు. ఫస్ట్ టైం వచ్చావు నీకు పార్టీ చాలా గౌరవించింది. వేరే రాష్ట్రం నుంచి వచ్చిన నీకు ఎమ్మెల్యే ఇచ్చి మంత్రిని చేశాం. నీకు పట్టుదల లేకపోతే ఎలా . సీరియస్‌గా తీసుకోవాలంటూ మంత్రి వాసంశెట్టి శుభాష్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు గట్టిగానే క్లాస్ తీసుకున్నారు.