Viral News : ఆరు బయట మల విసర్జన చేస్తున్నారా..అయితే చేసేటప్పుడు జాగ్రత్త..!

Viral News, Fish
Viral News : వియత్నాంలో తాజాగా అసాధారణ ఘటన వెలు గు చూసింది. ఓ వ్యక్తి పెద్దపేగులోకి చొరబడ్డ ఈల్ చేపను వైద్యులు ఆపరేషన్ చేసి వెలికి తీశారు. క్వాంగ్ ప్రావిన్స్‌లో ఈ ఘటన వెలుగు చూసిం ది.పేగుల్లో సజీవంగా ఉన్న ఈల్ ను చూసి వైద్యులే ఆశ్చర్యపోయారు.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, హాయ్‌హా జిల్లాకు చెందిన 34 ఏళ్ల బాధితుడు ఇటీవల కడుపునొప్పితో స్థానిక ఆసుపత్రిలో చేరాడు. అతడికి ఎక్స్‌రే తీసిన వైద్యులు కోలాన్‌లో (పెద్ద పేగు చివరి భాగం) సజీవంగా ఉన్న 30 సెంటీ మీటర్ల ఈల్ చేపను చూసి నోరెళ్లబెట్టారు. అతడి పేగులకు అది చిల్లులు పెట్టిందని కూడా గుర్తించా రు. వెంటనే ఆపరేషన్ చేసి దాన్ని బయటకు తీశారు.
సంక్లిష్టమైన ఈ ఆపరేషన్ విజయవంతమై నందు కు వైద్యులు హర్షం వ్యక్తం చేశారు. అనేక వ్యాధి కారక సూక్ష్మక్రిములకు ఆవాసమైన పురీషనాళం పక్కనే కోలాన్ ఉండటంతో ఆపరేషన్ సందర్భంగా ఇన్ఫెక్షన్ తలెత్తే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. అయితే శస్త్ర చికిత్స తర్వాత ఈ ఏ సమస్య లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకు న్నారు.
బాధితుడి మలద్వారం, పురీషనాళం మీదుగా ఈల్ చేప పెద్ద పేగులోకి చొరబడి ఉండొచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు. ఇది అసాధారణ ఘటనని పేగుల్లో చొరబడ్డాక కూడా ఈల్ చేప సజీవంగా ఉండటం ఆశ్చర్యమని వైద్యులు అన్నారు. అతడి పేగులో గాయపడ్డ భాగాల్ని వైద్యులు తొలగించారు. ప్రస్తుతం బాధితుడు కోలుకుంటున్నాడని చెప్పారు.