JAISW News Telugu

Viral News : తిమింగళంతో ఆటనా.. మరింత క్రేజీగా.. చివరికి ఏమైందంటే?

Viral News : భూ గ్రహంపై అతి భారీ జీవులు తిమింగళాలే. సముద్రం అంతటికీ రారాజులా గుర్తింపు సంపాదించుకుంది. నోరు తెరిస్తే చాలు సముద్రాన్నే మింగుతుందా? అన్నంత ఆశ్చర్యం కలుగుతుంది. సముద్రంలో ప్రయాణించే వారికి ఎటువంటి హానీ చేయని ఈ జీవులు భారీ ఆకారాలతో రాక్షసుల్లా కనిపిస్తుంటాయి. ఒక్కో తిమింగళం ఒక్కో భారీ ఓడ పరిమాణంలో ఉంటుంది. వాటిపట్ల గౌరవ మర్యాదలు చూపామా సరే.., కానీ ఆడుకుంటే మాత్రం వాటి ఆట మరోలా ఉంటుంది. ఇక్కడ వాటి ఆటను చూసిన బోటు నిర్వాహకుడు ఖంగుతిన్నాడు.

తిమింగళం బోటును బోల్తా పడేసిన ఘటన అమెరికాలోని న్యూహాంప్‌షైర్‌ వద్ద ప్రోట్స్‌మౌత్‌ హార్బర్‌ జలాల్లో జరిగింది. 23 అడుగులున్న పడవలో కొందరు జాలార్లు చేపల వేటకు వెళ్లారు. అదే సమయంలో అక్కడికి ఒక భారీ తిమింగలం వచ్చింది. జరుగుతున్న పరిణామాలను సమీపంలోని కొలిన్‌, వ్యాటీయగీర్‌ అనే ఇద్దరు వీడియో తీశారు. ఆ తిమింగలం ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి ఆ బోటుపై పడింది. ఆ తిమింగళం బరువుకు బోటు బోల్తాపడింది. అందులో ఉన్న ఒకరు ముందుగానే నీటిలోకి దూకేయగా.. మరొకరు బోల్తా పడడంతో పడిపోయారు. తక్షణమే సమీపంలోని బోటు నడుపుతున్న వారు అక్కడికి చేరుకొని వారిని రక్షించారు. ఈ ఘటనలో తిమింగళం కూడా ఎటువంటి గాయాలకు గురి కాలేదు.

న్యూహంప్‌షైర్‌ జలాల్లోకి తిమింగలాలు రావడం సహజమే. ముఖ్యంగా జూన్‌ – ఆగస్ట్ వరకు వీటి సంచారం మరింత ఎక్కువగా ఉంటుంది. బోటు పైకి దూకిన తిమింగలం ఆ తర్వాత కొంత సేపటి వరకు అక్కడే తిరుగుతోంది. ఈ ఘటనపై అమెరికా కోస్టుగార్డ్‌ ‘ది సెంటర్‌ ఆఫ్‌ కోస్టల్‌ స్టడీస్‌ మెరైన్‌ యానిమల్‌’కు సమచారం అందించారు.

Exit mobile version