JAISW News Telugu

Vijay Devarakonda : విలేజ్ డ్రామా విజయ్ దేవరకొండ తర్వాతి ప్రాజెక్ట్.. డైరెక్టర్, ప్రొడ్యూసర్ తో అనౌన్స్ చేసిన రౌడీబాయ్..

Vijay Devarakonda

Vijay Devarakonda

Vijay Devarakonda : ఇటీవల ఓటీటీలోకి వచ్చిన విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ థియేటర్ కంటే భారీ వ్యూవ్స్ సంపాదించుకుంది. అమేజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని చూసిన వారి సంఖ్య థియేటర్ లో చూసిన వారి కంటే పెరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ తన తర్వాతి ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశాడు.

విజయ్ దేవరకొండ, నిర్మాత దిల్ రాజు కాంబోలో ఒక సినిమా రాబోతోంది. ఈ వికషయాన్ని కోలా రవికిరణ్ వివరించారు. దిల్ రాజు, విజయ్ దేవరకొండతో కలిసి దిగిన చిత్రాన్ని ఆయన తన ఎక్స్ (ట్విట్టర్)ఖాతాలో షేర్ చేశాడు.

విజయ్ దేవరకొండకు సంబంధించి ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. రవికిరణ్ కోలా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్, రవి కాంబో ఇదే ఫస్ట్ కావడం విశేషం. ఈ సినిమా టైటిల్, ఇతర తారాగణం, విడుదల తేదీ తదితర వివరాలు తెలియాల్సి ఉంది. ఈ చిత్రం విజయ్ దేవరకొండకు ఫస్ట్ విలేజ్ డ్రామా మూవీగా ఉండబోతోందని మాత్రం సంకేతాలు వస్తున్నాయి.

క్లారిటీ ఇచ్చిన రవి..
ఎక్స్ లో డైరెక్టర్ కోలా రవి కిరణ్ ఇలా రాసుకున్నారు. ‘మా డైనమైట్ వెలిగించాల్సిన సమయం ఆసన్నమైంది’ అని క్యాప్షన్ ఇచ్చారు. మన కలను సాకారం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. @TheDevarakonda *ఫైర్ అండ్ హగ్ ఫేస్ ఎమోజీలు). వినాశనం చేద్దాం, నువ్వూ నేనూ. @SVC_official #DilRaju గారు #Sirish గారు.#SVC59. మేమిద్దరం కలిసి ఒక ప్రామిసింగ్ సినిమా అందిస్తాం. 9న కలుద్దాం. వచ్చేసారి వరకు.’ అని రాసుకున్నారు.

థియేటర్లలోకి వచ్చిన ‘ది ఫ్యామిలీ స్టార్’ ఏప్రిల్ 26న ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చింది. పరశురాం పెట్ల దర్శకత్వం వహించారు. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 5న దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించారు.

ఫ్యామిలీ స్టార్ లో భాగమైన విజయ్..

ఈ చిత్రం గురించి విజయ్ మాట్లాడుతూ ‘ది ఫ్యామిలీ స్టార్ లో గోవర్ధన్ గా నటించడం చాలా మంచి అనుభవం. ఆయన ఆదర్శమైన, నిజమైన హీరో, అతను చేసే వ్యక్తిగత త్యాగాలకు ఫిర్యాదు చేయకుండా లేదా గుర్తింపు పొందకుండా తన మొత్తం కుటుంబం యొక్క బాధ్యతను భుజానికెత్తుకునే వ్యక్తి.’ అని అన్నాడు.

‘మధ్య తరగతి ప్రజల దైనందిన పోరాటాలు, విజయాలను ప్రతిబింబించేలా ఆయన ప్రయాణం సాగుతుందని, ఇది సంస్కృతులకు అతీతంగా ప్రేక్షకులను అలరిస్తుందన్నారు. ఈ చిత్రం కుటుంబ బంధాల సారాన్ని, ప్రేమ సంక్లిష్టతలను చూపుతుందని విజయ్ దేవరకొండ అన్నారు. విజయ్ తన తర్వాతి ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడంలో ఫ్యాన్స్ లో ఆనందం వెళ్లివిరుస్తోంది.

Exit mobile version