Vijayawada Politics : బీసీ కార్డు వికటించిందా? బ్రాహ్మణుల ఆగ్రహం ముంచుకొచ్చింది!

Vijayawada Politics : దేశంలోని అన్ని ప్రధాన పార్టీలు ( కామ్రేడ్ స్ మినహా) బహిరంగంగా బీసీ కార్డు, ఎస్సీ వర్గీకరణ సామాజిక అవసరంగా ప్రచారం చేస్తున్నారు. విజయవాడలో 1983-84 లో ఒక బ్రాహ్మణ పాత్రికేయుడు తమ కులం వారితో చిన్న సమావేశం ఏర్పాటు చేసి తెలుగు దేశం పార్టీలో తమ పాత్ర ఎమిటి? అన్న విషయం చర్చకు పెట్టారు. ఆ రోజులలో కేంద్రంలో కాంగ్రెస్, రాష్ట్రం లో కూడా కాంగ్రెస్ పార్టీకి బ్రాహ్మణులు సపోర్ట్ చేసే నాయకులు వున్నారు; పత్రికా రంగంలో కూడా! ఆ సమావేశంలో తెలుగు దేశం పార్టీ కమ్మ సామాజిక వర్గం పార్టీ గా అభివర్ణించడం జరిగింది. అదే సమయంలో నెహ్రూ తెలుగు దేశం పార్టీలో చేరడం, వంగ వీటి రంగా కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది.

ఈ పరిణామం కూడా తెలుగు దేశం పార్టీ పై కమ్మ ముద్ర పడటానికి దోహద పడింది. పై పెచ్చు అప్ప టివరకు అధికార కాంగ్రెస్ పార్టీలో మంత్రి స్థాయిలో వున్న నాదెండ్ల భాస్కరరావు చేరిక కూడా ఈ ముద్ర గట్టిగా పడటానికి కారణం అయింది. వాస్త వానికి వంగవీటి రంగా స్వయంగా ఎన్టీఆర్ అభిమాని. తన అను చరులతో సంప్రదించి టీడీపీ లో చేరడానికి , రాఘవయ్య పార్క్ దగ్గర ఘన స్వాగతం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసు కున్నారు. ఎన్టీఆర్ విజయవాడ ప్రదర్శనగా వస్తున్నారు. ఇంతలో దేవినేని నెహ్రూ తన అనుచరులతో గొల్లపూడి వద్ద ఎన్టీఆర్ కి స్వాగతం చెప్పి తెలుగు దేశం పార్టీలో చేరారు. రంగా- నెహ్రూ క్లాష్ జగద్వితమే! అనివార్యంగా రంగా తన నిర్ణయాన్ని మార్చుకో వలసి వచ్చింది. ఈ విషయం ప్రస్తావించడానికి కారణం- మళ్లీ విజయవాడ నేపథ్యంగా బ్రహ్మణులు సంఘటితం అయ్యారు.

– వీరి వెనుక విజయవాడ ఎంఎల్ఎ మల్లాది విష్ణు
సెంట్రల్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన మల్లాది విష్ణు కు సీట్ ఇవ్వకుండా వెస్ట్ కాండిడేట్ ( మాజీ మినిస్టర్) వెళ్ళంపల్లి కి సీటు ఇవ్వడం బ్రాహ్మణ వర్గీయులు జీర్ణించుకోలేక పోయారు. వెల్లంపల్లి మంత్రిగా విజయవాడ వెస్ట్ వారికే ప్రాధాన్యత ఇచ్చారు అని గుర్రుగా ఉన్న విజయవాడ కాంగ్రెస్ వారు, ప్రత్యేకించి బ్రహ్మణ వర్గం ముఖ్యమంత్రిని నేరుగా కలవడానికి సిద్ధ పడ్డారు, కానీ చివరి నిమిషంలో ఆగిపోయి ఇప్పుడు బహిరంగంగా బయటకు వచ్చారు.

( అన్నట్టు మల్లాది విష్ణు వంగవీటి రంగా అనుచరుడు; రాజశేఖర రెడ్డి అభిమాని. రంగా హత్యా సమయంలో ప్రాణాలతో బయట పడిన మృత్యుంజయుడు)

— తోటకూర రఘు, ఆంధ్ర జ్యోతి వీక్లీ మాజీ సంపాదకులు

TAGS